ముంబై, నవంబర్‌ 21: భారత క్రికెట్‌ అభిమానుల గుండె బద్ధలైంది. అలా జరిగి ఉండకూడదని, అది కల అయితే బాగుండని ప్రతి ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్‌ కోరుకున్నాడు. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ 2023 టోర్నీ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్‌ టీమ్‌ కప్పు అందుకునే చిట్టచివరి మెట్టుపై పట్టు తప్పి పడిపోయింది. వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ చేతిలో భారత్‌ ఓడిరది. విరాట్‌ కోహ్లి‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును అందుకున్నాడు.ఆట పరంగా మన దేశానికి ఇది గుండెకోతే అయినా, భారత ఆర్థిక వ్యవస్థకు మాత్రం చాలా ప్రయోజనాలు అందాయి. ఃూః ఎకనామిక్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, మన దేశంలోని చాలా రంగాల్లో ఐసీసీ టోర్నీ దీపావళి వెలుగులు నింపింది. ఈ ఈవెంట్‌ కోసం ప్రపంచం నలుమూలల నుంచి క్రికెట్‌ జట్లు, అభిమానులు తరలి వచ్చారు. దీనివల్ల విమానయానం, రవాణా రంగాలకు బాగా డబ్బులు వచ్చాయి. హోటళ్లు, ఫుడ్‌ ఇండస్ట్రీ, డెలివరీ సర్వీసులతో కూడిన హాస్పిటాలిటీ సెక్టార్‌ కూడా లాభపడిరది. ఫుడ్‌ తింటూ ప్రపంచ కప్‌ మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు, అభిమానులు చిరుతిళ్లు, కూల్‌డ్రిరక్స్‌ను ఎక్కువగా కొన్నారు.వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ టోర్నీలో, మొత్తం టిక్కెట్ల అమ్మకాలు రూ.1,600`2,200 కోట్ల వరకు ఉంటాయని ఃూః రిపోర్ట్‌లో ఉంది. టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌ల్లో మొత్తం వీక్షకుల సంఖ్య టీవీ, ూుు ఫ్లాట్‌ఫామ్స్‌ కలిపి గణనీయంగా పెరిగింది. గత వరల్డ్‌ కప్‌లోని వ్యూయర్‌షిప్‌ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఃూః అంచనా వేసింది. ఈ వ్యూయర్‌షిప్‌ను బట్టి, స్పాన్సర్‌షిప్‌/టీవీ హక్కులు దాదాపు రూ. 10,500`12,000 కోట్లకు చేరుకోవచ్చని లెక్కగట్టింది. ఈ మెగా ఈవెంట్‌కు విదేశీ క్రికెట్‌ అభిమానులు కూడా తరలివచ్చారు. ఒక్కో మ్యాచ్‌కు సగటున 1,000 మంది ఫారిన్‌ టూరిస్టులు వచ్చారని ఊహించినా… ఇండియాలో వాళ్ల షాపింగ్‌, హోటల్‌, ఆహారం, ప్రయాణాల కోసం రూ.450`600 కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు. మ్యాచ్‌లు చూడడానికి ఇండియా అభిమానులు చేసిన ప్రయాణాలు, వాహనాల కోసం ఇంధనం, హోటళ్లలో బస, ఫుడ్‌ వంటి వాటి కోసం రూ.300`500 కోట్లు ఖర్చు చేసి ఉండొచ్చని అంచనా. ఇక, రెస్టారెంట్లు, కేఫ్‌లకు వెళ్లి మ్యాచ్‌లు చూసిన వాళ్లు అక్కడే తిన్నారు, తాగారు. ఇళ్లలోనే ఉండి మ్యాచ్‌లు చూసినవాళ్లు వివిధ యాప్‌ల ద్వారా ఫుడ్‌ ఆర్డర్లు పెట్టారు. ఇలా.. ఈవెంట్‌ మొత్తం టైమ్‌లో రూ. 4,000`5,000 కోట్లు ఖర్చు చేసి ఉండవచ్చు.ఈ లెక్కలన్నీ కలిపితే, ప్రపంచ కప్‌ మ్యాచ్‌ల కోసం ప్రజలు చేసిన మొత్తం వ్యయం రూ. 18,000`22,000 కోట్ల రేంజ్‌లో ఉంటుందని ఃూః భావిస్తోంది. ఈ మొత్తం, మన దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది.ఇది మాత్రమే కాదు.. అమ్మకాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌ డెలివరీపై ఉూు ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలోకి పన్ను వసూళ్లు పెరుగుతాయి. వివిధ రంగాల నుంచి వచ్చే జీఎస్‌టీ మొత్తాలతో కేంద్ర ప్రభుత్వ ఖజానా మరింతగా నిండుతుంది. అయితే, ఇవన్నీ అంచనాలు మాత్రమే. ఖచ్చితమైన లెక్కలు అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *