స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 74వ ఫౌండేషన్ డే (ఫ్లాగ్ డే) సందర్భంగా మంగళవారం ఉదయం జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్కౌట్ అధికారులు, విద్యార్థులు గౌరవ ప్రదంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో దేశ భక్తి, నైతిక విలువలు, సామాజిక సేవ పెంపొందడానికి స్కౌట్ శిక్షణ తోడ్పడుతుందన్నారు. స్కౌట్ సర్టిఫికెట్ కలవారికి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కలదన్నారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని స్కౌట్ అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ద్వారా మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్కౌట్ క్రమశిక్షణకు మారు పేరని, విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి స్కౌట్‌లో చేరాలన్నారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి,
జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరాం పురుషోత్తం, డిప్యూటీ డిఇఓ వరలక్ష్మి ,అసిస్టెంట్ డైరెక్టర్ ప్రసాద్ బాబు, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు.