యండపల్లి (రాయచోటి అన్నమయ్య జిల్లా):- వైయస్సార్ కడప జిల్లా కేంద్రంలో పిపి యూనిట్ నందు సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.సునీల్ కుమార్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరెట్ కార్యాలయం నందు జాతీయ ఆంధత్వ నివారణ కార్యక్రమం జాయింట్ డైరెక్టర్ గా పదోన్నతి పొందడం పట్ల ఏపి డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు.డాక్టర్ బి.సునిల్ కుమార్ నాయక్ గతంలో అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, యండపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారిగా విధులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.ఏపి డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్వహించిన ధర్మపోరాట ఉద్యమంలో పాల్గొని సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసిన వ్యక్తియని ఆయన కొనియాడారు. ఆయన స్వగ్రామం అన్నమయ్య జిల్లా, సుండుపల్లె మండలం, మాచిరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ పెద్ద బిడికి చెందిన వారు కావడం మరో విశేషమని, ఈ మారుమూల ప్రాంతం నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం గర్వించదగ్గ విషయమని ఆయన అనందం వ్యక్తం చేశారు.