అన్నమయ్య జిల్లా: వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు బిజెపి జిల్లా కిసాన్ మొర్చా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ వర్మ, బీజీపీ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జీ వెంకట్రామ రాజు,బిజెపి కిసాన్ మర్చా రాష్ట్ర హార్టికల్చర్ కన్వీనర్ మనోహర్ గౌడ్ లు.ఎపి రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురెందేశ్వరి,బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్చా చిగురు పాటి కుమార స్వామి ల ఉత్త్వరుల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని జిల్లా కేంద్రాల వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అందులో బాగంగా అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదుట రాయచోటి ,రాజంపేట అసెంబ్లీ కన్వీనర్లు అరమాటి శివగంగ రెడ్డి రామ జగదీష్ స్వామి లతో కలిసి బిజెపి జిల్లా కిసాన్ మొర్చా అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ వర్మ, బీజీపీ కిసాన్ మోర్చా జోనల్ ఇంచార్జీ వెంకట్రామ రాజు,బిజెపి కిసాన్ మర్చా రాష్ట్ర హార్టికల్చర్ కన్వీనర్ మనోహర్ గౌడ్ లు ఈ ధర్నా కార్యక్రమాన్ని వారు నిర్వహించారు.ముందుగా కలెక్టర్ కార్యాలయం వరకు బిజెపి శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న రైతాంగానికి వెంటనే కరువు నష్టం పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఎటువంటి నిర్మాణానికి నోచుకోలేదు, వెంటనే యుద్ద ప్రాతిపదికన నిర్మాణాలు మొదలుపెట్టి రైతంగాన్ని ఆదుకోవాలన్నారు. ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలలో జరిగిన ప్రాణ నష్టము, ఆస్తి నష్టము తో పాటు గృహాలు కోల్పోయిన వారికి వెంటనే పరిహారం అందించి పక్క గృహాలు నిర్మింపజేయాలన్నారు. జరికోన సాగు నీటి కాలువలు పునరుద్ధరించి రైతులకు సాగునీరు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పండ్లతోడ్ల అధికంగా ఉన్నందువలన మార్కెటింగ్ సౌకర్యం కల్పించి అన్నదాతల పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలనీ ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *