అన్నమయ్య జిల్లా:రైతు పక్షపాతి సీఎం జగన్ అని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్లీనరీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి దన్నుగా ఉండేందుకు తన మ్యానిఫెస్టోలో పెట్టుబడి నిధి క్రింద నాలుగు సంవత్సరాలకు ఏటా ప్రతి రైతుకు రూ12,500 చొప్పున రూ 50 వేలు అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నికలు అయిన తరువాత రైతు సంక్షేమం దృష్ట్యా రూ 12,500ను రూ.13,500 చేసి ఐదేళ్ల పాటు అందించాలని నిర్ణయించారన్నారు. ఏటా రూ 13,500 చొప్పున ఐదేళ్లకు కు గాను రూ.67,500 ను అందించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటికి నాలుగేళ్లకు గాను రూ.54 వేలు జమ చేయడం జరిగిందని తెలిపారు., ఐదవ ఏడాది తొలి విడత రూ.7,500 జమ అయిందని, ప్రస్తుతం రూ 4000 రైతుల ఖాతాలలో నేడు జమ కానుందన్నారు. మొత్తం అంతా కలిపి రూ.65,500 అర్హులైన ప్రతి రైతుకూ లబ్ది చేకూరినట్లు ఆవుతోందన్నారు.

ఐదవ ఏడాది రెండవ విడతలో రాయచోటి నియోజక వర్గంలో లబ్ది పొందుతున్న రైతులు: 40,460, లబ్ది: రూ 16.53 కోట్లు

రాయచోటి నియోజక వర్గంలో సంవత్సరానికి దాదాపుగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రూ.50 కోట్లు చొప్పున రైతుల ఖాతాలలో జమ అయ్యాయన్నారు.ఐదవ ఏడాది తొలివిడతతో కలిపి రూ.250 కోట్లు పెట్టుబడి నిధి కింద రాయచోటి నియోజకవర్గం పరిధిలోని రైతులకు ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఐదవ ఏడాది రెండవ విడతతో 40,460 మంది రైతన్నలుకు కలుగుతున్న లబ్ది రూ16.53 కోట్లతో కలిపి రూ.266 కోట్లు రాయచోటి నియోజక వర్గంలోని రైతులు లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. తుఫాను వచ్చిన సమయంలో ఆ సంవత్సరం పూర్తిగా రూ.50 కోట్లు పంట నష్ట పరిహారం రాయచోటి నియోజక వర్గం రైతులకు జమ చేయడం జరిగిందన్నారు. చెప్పింది చెప్పినట్లుగా సీఎం జగన్ చేసి నిరూపించారన్నారు.
మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలుపరచడం, రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ లు చెల్లించడం, ఈ క్రాపింగ్ విధానంలో రైతు భరోసా కేంద్రాలలో నమోదు చేయడం హర్షణీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన అయిదేళ్ళుగా అమలుచేస్తున్న డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం నిధులను ప్రభుత్వం నేడు మంగళవారం అందచేయనుందన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఆర్ధికసాయాన్ని జమ చేయనున్నారన్నారు.

ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు:

వరుసగా ఐదో సంవత్సరం రెండవ ఏడాది రబీ ప్రారంభంలో పెట్టుబడి నిధి కింద నిధులు విడుదల చేస్తున్న సీఎం జగన్ కు శ్రీకాంత్ రెడ్డి నియోజక వర్గ రైతన్నల తరపున శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రైతుకుటుంబాలలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బడికి పంపించే వారికి అమ్మఒడి, 45 సంవత్సరాల వయస్సు దాటిన వారికి వైఎస్ఆర్ చేయూత, ఈబిసి నేస్తం, కాపు నేస్తం పథకాలు అందుతున్నాయన్నారు. డ్వాక్రాలో ఉన్న మహిళలకు రుణాలు మూడు విడతలు మాపీ సొమ్ము అందిందన్నారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పెన్షన్ రూపంలో మేలు జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

కరవు రైతులకు తోడుగా:
నాలుగేళ్ళ పాటు వర్షాలు సంవృద్దిగా కురిసి ఈ ఏడాదితీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. పంటల సాగు తగ్గిందన్నారు. పంటలు పెట్టి నష్టపోతున్న రైతులకు పంటల బీమా, ఇన్ ఫుట్ సబ్సిడీలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరవు పరిస్థితుల్లో రైతులకు తోడుగా నిలుస్తామన్నారు. దేవుడి దయవల్ల వర్షాలు సంవృద్దిగా కురిసి రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *