అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను పక్కాగా తనిఖీ నిర్వహించాలి
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్‌
తిరుపతి: అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను పక్కాగా తనిఖీ నిర్వహించాలి జిల్లా కలెక్టర్‌ కె. వెంకటరమణా రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ… అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లు ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులను పక్కాగా తనిఖీ నిర్వహించాలనీ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. సమాజం లో స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని లింగ వివక్ష ఉండ కూడదు అని తెలిపారు. గర్భంలో ఉన్న పిండం, తల్లి ఆరోగ్య పరిస్థితిపై పరీక్ష కోసం స్కానింగ్‌ పరికరాలు వాడాల్సి ఉంటుందని, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్షత కారణంగా బాల, బాలికల లింగ నిష్పత్తిలో ఎక్కువ తేడాలు ఉన్నాయని అన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడిన వారికి 50 వేల రూపాయలు జరిమానితో పాటు మూడు సంవత్సరాల కారాగార శిక్ష ఉంటుందని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న స్కానింగ్‌ సెంటర్ల వారి రిజిస్ట్రేషన్‌ తొలగించడం మరియు క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనుమానం ఉన్న స్కానింగ్‌ సెంటర్‌ లపై ఆకస్మిక తనిఖీలు, స్ట్రింగ్‌ ఆపరేషన్‌, డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించి గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే ఆ సంస్థ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. కావున ప్రజలలో గర్భస్థ పిండలింగ నిర్ధారణ చట్టం పై అవగాహన పెంచేలా కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు.
డి ఎం హెచ్‌ ఓ మాట్లాడుతూ … జిల్లాలో అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్‌ లపై నిరంతరము పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. లింగ నిష్పత్తి గురించి తెలిసేలా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ కాటంరాజు, డిఎంహెచ్‌ఓ శ్రీహరి, డిపీఎంఓ శ్రీనివాస్‌, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి శాంత కుమారి, లీగల్‌ అడ్వైజర్‌ ఇంద్రాణి, గైనకాలజిస్ట్‌ డా. మాధవి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *