ఈనెల 4,5 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో బి.ఎల్.ఓ.లు .
ఓటరు నమోదు, సవరణలకు అవకాశం: ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి
తిరుపతి: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ `2024 మేరకు ఎన్నికల కమిషన్ గత మాసం తేది 27 న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడం జరిగిందని ఆమేరకు ఈనెల 4,5 తేదీల్లో శని,ఆది వారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి చంద్రగిరి నియోజక వర్గం పరిధిలో 395 పోలింగ్ కేంద్రాల్లో జాబితా అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలని చంద్రగిరి ఇ ఆర్ ఓ మరియు తిరుపతి ఆర్ డి ఓ నిశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా మేరకు ఓటర్లు 3,00,940 మంది, సర్వీస్ ఓటర్లు 410 వున్నారని ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ప్రత్యేకంగా ఈ నెల 4,5 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు బి ఎల్ ఓ లు పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని అన్నారు. ఓటరు నమోదు , సవరణలకు, తొలగింపులకు సంబంధించిన ఫారమ్స్ 6, 6ఎ, 7, 8 అందుబాటులో ఉంటాయని తెలిపారు. నియోజకవర్గం లోని ఓటర్లు తప్పనిసరి జాబితా సరిచుసుకోవాలని, రానున్న జనవరి 2024 కు 18 సంవత్సరాల వయస్సు నిండినున్నవారు తప్పనిసరి ఓటు నమోదు చేసుకోవాలని, యువ ఓటర్లు కీలకమని సూచించారు.