రాజమండ్రి, అక్టోబరు 31: ఎన్టీఆర్‌ వారసులు రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ఎన్టీఆర్‌ కూతుళ్లు పురంధేశ్వరి, భువనేశ్వరి రాజకీయాల్లో చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ఓవైపు నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లారు. మరోవైపు అధికార పార్టీపై పురంధేశ్వరి ఏకంగా యుద్ధమే ప్రకటించారు. పురంధేశ్వరి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. భువనేశ్వరి మాత్రం ఇప్పటి వరకు రాజకీయాలు దూరంగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో సీన్‌ మారిది. తప్పని పరిస్థితుల్లో భువనేశ్వరి బయటకు రావాల్సి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌ కావడంతో పార్టీని నడిపించే బాధ్యతను భువనేశ్వరి తీసుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో వైసీపీ ప్రభుత్వంపై భువనేశ్వరి తీవ్ర స్థాయిలో విమర్శించారు. తన భర్తను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్‌ చేసిందని ఆమె ఆరోపించారుమరో వైపు వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి దూకుడు పెంచింది. పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక వైసీపీపై తనదైన శైలిలో పోరాటం సాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పులపై పోరాటం కొనసాగిస్తూనే మద్యం అమ్మకాలపైనా, మద్యం నాణ్యతపైనా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. జగన్‌పై పోరు చేస్తున్న పురంధేశ్వరి, భువనేశ్వరిపై వైసీపీ మంత్రులు కౌంటర్‌ ఎటాక్‌ చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి రోజా అప్పుడప్పుడు స్పందిస్తున్న..మిగతా వైసీపీ మహిళా నేతలు స్పందించకపోవడంలో అంతర్యం ఏమిటో..తెలియాల్సి ఉంది. మహిళా మంత్రుల తీరుపై సొంత పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *