ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రాయచోటి మొట్టమొదటి ఎమ్మెల్యే స్వర్గీయ యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి కుమారుడు కావడం విశేషం
సుండుపల్లె-(రాయచోటి, అన్నమయ్య జిల్లా):- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎమ్మెల్యేస్ కాలనీ, రిక్రియేషన్ సెంటర్ కు 24-09-2023 తేదీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, రాయచోటి మొట్టమొదటి ఎమ్మెల్యే స్వర్గీయ యర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గారి మూడవ కుమారుడు డాక్టర్ ఏరుకులరెడ్డి (డాక్టర్ వైవైరెడ్డి)అధ్యక్షుడుగా 234 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం పట్ల రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి ఒక ప్రకటన ద్వారా హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యేస్ కాలనీ రిక్రియేషన్ సెంటర్ నందు 1400 మంది ఓటర్లు ఉండగా 967 ఓట్లు పోల్ కావడం, డాక్టర్ వైవైరెడ్డి అధ్యక్షుడుగా 234 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగిందని ఆయన తెలిపారు.అదే విధంగా ఆయన ప్యానల్ కూడా విజయం సాధించిన విషయం తెలిపారు. ఆయన అన్నమయ్య జిల్లా, సుండుపల్లె మండలం, సుండుపల్లె గ్రామ పంచాయతీ, రెడ్డివారిపల్లెకు చెందిన వ్యక్తి కావడం విశేషమని,ఈ ప్రాంతం వారు ఆయన ఎన్నిక పట్ల బంధు,మిత్రులు, ప్రజలు అనందం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు.డాక్డర్ వైవైరెడ్డి చాలా కాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలోను మరియు ఎమ్మెల్యేస్ కాలనీ నందు ప్రభుత్వ చీప్ డాక్టర్ గా విశేష సేవలందించి అక్కడ వారి తలలో నాలుకలా మంచి పేరు పొందారని ఆయన తెలిపారు.డాక్టర్ వైవైరెడ్డి గారు ప్రభుత్వ డాక్టర్ ఉద్యోగం నుండి కొన్ని సంవత్సరాల క్రితం రిటైర్మెంటైనారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేస్ కాలనీ రిక్రియేషన్ సెంటర్ కు గత రెండుసార్లు కార్యదర్శిగా ఎన్నికైనారని, మూడోసారి కూడా ఆద్యాక్షులుగా ఎన్నిక కావడం ప్రత్యేకమని, రెండు సంవత్సరాల కాలం పాటు ఆ భాద్యతలో ఉంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్ వైవైరెడ్డి గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.