రాయచోటి ప్రజలు శాంతి కాముకులు…
మీ గురించి ఆలోచించే సమయం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లేదు:మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు
రాయచోటి నియోజకవర్గం ప్రజలు నిత్యం ప్రశాంతతను కోరుకుంటారు… రాయచోటిలో తప్పుడు ప్రచారాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రజలు అవకాశం ఇవ్వరు, జరుగుతున్న అభివృద్ధి,, ప్రజలకు అణువుగా ఉన్న రాయచోటి ప్రశాంతతను ఓర్వలేని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తే అది వారి దిగజారుడు తనమే అవుతుందని రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, వైస్ చైర్మన్ ఫయాజూర్ రెహమాన్ లు హితవు పలికారు. శనివారం ఆయన తోటి కౌన్సిలర్లతో కలిసి ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాయచోటి ప్రజలు శాంతితో పాటు అన్ని రంగాలలో వెనుకబడ్డ రాయచోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తారు. అలాంటి రాయచోటిలో దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ల సహకారంతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రాయచోటిలో ప్రశాంతతను కల్పిస్తూ అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నారు. చిల్లర రాజకీయాలు చేసే వారి గురించి, మీలాంటి వారి గురించి ఆలోచించాల్సిన అవసరం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి లేదు. ఆయన తపన నియోజకవర్గ అభివృద్ధి, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం కష్టపడతాడు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు, విద్యాలయాల నిర్మాణాలు, పేద మధ్యతరగతి ఆపై తరగతి వారికి అనువైన కాలనీల నిర్మాణం, ఆటలు కనులైన క్రీడా మైదానాలు ఏర్పాటు, రాబోయే 40 సంవత్సరాలకు అవసరమైన తాగునీటి వసతి సౌకర్యాలను కల్పించెలా వధకాలను రూపొందించడం, అన్నింటికీ మించి ఎవరు ఊహించని రీతిలో హంద్రీనీవా గండికోట ప్రాజెక్టుల అనుసంధానంతో శాశ్వత సాగు తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఎత్తిపోతల పథకాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అదే స్థాయిలో గ్రామీణ రహదారుల అభివృద్ది చక చక జరుగతోంది. ప్రతి పంచాయతీ పరిధిలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు హెల్త్ క్లినిక్ లకు పక్కా భవనాల నిర్మాణంలోప్రజలు
ముందున్నారు, రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కోసం వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తున్నారు. పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించేలా మున్సిపాలిటీని గ్రేట్ వన్ స్థాయి నుంచి స్పెషల్ గ్రేడ్ స్థాయికి తీసుకొచ్చారు. దీంతో రాయచోటిలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తికావస్తున్నాయి. మరోవైపు శాంతి కాముకుడిగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కి పేరు ఉంది. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిస్తూ రాష్ట్రంలోనే రాయచోటిని అన్ని రంగాలలో అభివృద్ధి. చేయాలన్న సంకల్పంతో ప్రణాళికల రూపంలో ముందుకు సాగుతున్న శ్రీకాంత్ రెడ్డి ని నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకుని నాలుగు పర్యాయాలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నారు. అభివృద్ధి ప్రణాళిక సాధకుడిగా పేరుందిన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనలేక అనైతికంగా ప్రజలను రెచ్చగొట్టే లా కొంతమంది తప్పుడు ప్రచారాలకు దిగడం తగదన్నారు. చేసిన తప్పులకు కేసులలో బాధితులుగా ఉంటూ మరొకరిపై నెపం వేయడం మంచిది కాదన్నారు. తోడు వచ్చిన వారితో కలిసి పోలీసులు పైనే దాడులకు తెగపడిన దృశ్యాలు, డ్యూటీలో ఉన్న పోలీసుల కళ్ళు పోయేలా, తలలు ఇతర అవయవాలు గాయపడి రక్తాలు కారేలా చేసిన దాడుల దృశ్యాలు రికార్డెడ్ గా దొరకడంతోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. అన్ని విధాలుగా ఆధారాలు లభించడంతోనే పోలీసులు కేసులు నమోదు చేశారే తప్ప వేరే ఎవరో పెట్టించిన కేసులు కాదన్నది అందరికీ తెలుసు. మీలాంటి వాళ్ల గురించి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏ రోజు, ఏ నిమిషము ఆలోచించరు. ఆయన దృష్టి అంతా రాయచోటి నియోజకవర్గం అభివృద్ధి, రాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి జగనన్నతో కలిసి భాగస్వామ్యం కావడం ఆయన పనిగా పెట్టుకుని ముందుకు పోతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ప్రశాంతంగా ఉన్న రాయచోటిని,, జరుగుతున్న అభివృద్ధికి సహకరించాల్సింది పోయి తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తే అదే ప్రజల నుంచి మరో మారు గుణపాఠం నేర్చుకోక తప్పదన్నారు.