ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష

ప్రోగ్రాం కోసం ఇంటింటా సర్వే.

ప్రోగ్రాం కోసం ఇంటింటా సర్వే అక్టోబరు 6 న మాధవరం కస్పా నందు జరిగే జెఏయస్ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాధవరం (రాయచోటి అన్నమయ్య జిల్లా) 22-09-2023 :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాధవరం-1 విలేజ్ హెల్త్ క్లీనిక్ పరిధిలోని కస్పా నందు రెండు ఆరోగ్య బృందాలు ప్రజల ఆరోగ్య స్థితిగతులపైన ఇంటింటా సర్వే నిర్వహించారు.ఆక్టోబరు 6 న మాధవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే జగనన్న ఆరోగ్య సురక్ష ఉచిత వైద్య శిబిరానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని సిబ్బంది తెలియజేశారు.ఈ సర్వే సందర్భంగా ప్రతి గృహ సందర్శనలో కుటుంబంలో ఎవరికైనా జ్వరాలు ఉన్నాయా, షుగర్, బిపి, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా?,లేవా? దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్నాయా? లేవా? వివరాలు సేకరించారు.అలాగే గర్భవతులు, బాలింతలు, కౌమార బాలికల ఉన్నారా? లేరా? సమాచారం తెలుసుకున్నారు.అలాగే మీకు గాని,కుటుంబ సభ్యులకు గాని దృష్టి లోపం గాని,కంటి సమస్యలు గాని ఉన్నాయా,దంత సమస్యలు, రెండు వారాలకు మించి దగ్గు ఉన్నదా? లేదా?స్పర్శ లేని మచ్చలు ఉన్నాయా? లేవా? సమాచారం సేకరించారు.ఈ సందర్భంగా అవసరమైన వారికి బిపి పరీక్ష, షుగర్ పరీక్ష, హిమోగ్లోబిన్ పరీక్ష, యూరిన్ పరీక్ష, మలేరియా పరీక్ష, డెంగీ పరీక్ష,కళ్ళె పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజలందరికీ డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందటం ఎలా? అనే కరపత్రాలు ఇంటింట పంపిణీ చేశారు. అదేవిధంగా 104 కాల్ సెంటర్ ద్వారా, విలేజ్ హెల్త్ క్లీనిక్ ద్వారా,108 అంబులెన్స్ ద్వారా, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ద్వారా, డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం ద్వారా పొందే సేవలు గురించి వివరించారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ నందు వైయస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేపించారు. ఈ కార్యక్రమంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి,సిహెచ్ఒలు కె.శిరోమణి, యస్.సహనాజ్, ఏయన్ యంలు యస్.గీతాంజలీ,బి.శ్రీవిద్య ఆశా కార్యకర్తలు టి.రెడ్డిరాణి,టి.అనసూయమ్మ,బి.గంగాదేవి,కె.గీతారాణి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *