ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి చొరవతో ప్రమాద బాధిత కుటుంబానికి …

బాధిత కుటుంబానికి మంజూరు ఉత్తర్వులును అందచేసిన మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి

రామాపురం మండలం నీలకంఠరావుపేటకు చెందిన పఠాన్ గౌస్ ఖాన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు.దీంతో వైఎస్ఆర్ బీమా క్రింద రూ 5 లక్షల నిధులు మంజూరు అయ్యాయి.మంజూరు ఉత్తర్వులును శనివారం బాధిత కుటుంబానికి మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి అందచేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంభ సభ్యులు మాట్లాడుతూ కుటుంభ యజమాని ఆకస్మికంగా మృతి చెందడంతో అనాథగా మారిన కుటుంబానికి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి,మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి లు అండగా నిలిచారని,వైఎస్ఆర్ బీమా క్రింద రూ 5 లక్షలు మంజూరు చేయించడం గొప్పవిషయమని,వారి మేలు మారువలేమంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కర్ణపు విశ్వనాధ రెడ్డి, మాజీ ఎంపిపి ప్రభాకర్ రెడ్డి,ఎంపిడిఓ హైదర్ వలీ, విశ్రాంత హిందీ పండిట్ గౌస్ మోహిద్దీన్, సర్పంచ్ ఆయూబ్,ఉప సర్పంచ్ రఫీ, వైఎస్ఆర్ సిపి జిల్లా కార్యదర్శి జాకీర్,సహదేవ రెడ్డి,రామగోపాల్ రెడ్డి, రషీద్ అహమ్మద్, మాజీ సర్పంచ్ సోదరుడు ఖాజా హుసేన్, జాఫర్, షఫీ, డిల్లు, ఫైరోజ్, ఆర్ టి సి రిటైర్డ్ డ్రైవర్ హసన్ షరీఫ్, జనార్ధన్ రెడ్డి,రాజు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *