కడప అక్టోబర్ 18: జిల్లాలోని కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రిందట నమోదైన గంజాయి కేసులో నిందితుడి ని అదుపులోకి తీసుకున్న కడప తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎన్.నాగరాజు (HC 1132), కానిస్టేబుల్ వై.ఓబులేసు (PC 888) లు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి కేసు లో ప్రధాన నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారంట్ ఉండి తప్పించుకు తిరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కడప డి.ఎస్పీ ఎం.డి షరీఫ్, తాలూకా సి.ఐ రాజా ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ ఎన్.నాగరాజు (HC 1132), కానిస్టేబుల్ వై.ఓబులేసు (PC 888) లు ముమ్మరంగా గాలించడంతో ఎట్టకేలకు పట్టుబడ్డాడు. దీంతో నిందితుడిని కడప నగరంలోని ఎక్సయిజ్ కోర్టు లో హాజరు పరచగా గౌరవ కోర్టు జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశించింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని శ్రమించి అదుపులోకి తీసుకోవడం అభినందనీయమన్నారు. మున్ముందు ఇదే స్ఫూర్తి తో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.