తిరుపతి జిల్లా… తిరుమల

రేపు జరగబోయే శ్రీవారి గరుడోత్సవానికి భద్రతా పరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి.

తిరుమల పోలీస్ కంట్రోల్ రూమ్ నందు పోలీస్ అధికారులతో సమీక్ష.

పోలీసులు అప్రమతంగా వుండాలి జాగ్రత్తలను వివరించిన తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,

శ్రీవారి భక్తులనే శ్రీ వెంకటేశ్వర స్వామిగా భావించి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి.

మాడవీధుల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసు వారు టిటిడి నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి.

సుమారు 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం.

గరుడోత్సవానికి 3,400 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు.

శ్రీవారి భక్తులతో ఎట్టి పరిస్థితులలో కూడా పోలీసులు దురుసుగా నడుచుకొరాదు ప్రశాంమైన వాతావరణంలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని ముందుండి కల్పించాలి..

షిఫ్టులు మారేటప్పుడు సంబంధిత సెక్టార్ సిబ్బందికి ఇన్చార్జ్ అధికారి తప్పనిసరిగా సిబ్బందికి బ్రీఫింగ్, డి-బ్రీఫింగ్ చేయాలి.

గరుడోత్సవ దర్శనం క్యూలైన్ల వద్ద అప్రమత్తంగా ఉంటూ సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.

రేపు బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టమైన శ్రీవారి గరుడ సేవను పురస్కరించుకొని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు మరియు టిటిడి సివి&ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్., వారు నాలుగు మాడ వీధులు, గ్యాలరీలు, ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గరుడోత్సవం దర్శనం క్యూలైన్ల ప్రాంతాలలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించి, భద్రతాపరమైన అంశాలపై తీసుకోవలసిన జాగ్రత్తలపై తిరుమల పోలీస్ కంట్రోల్ రూమ్ నందు పోలీస్ అధికారులతో సమీక్షించారు.

గత సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అహర్నిశలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి విజయవంతం చేశారు. అదే స్ఫూర్తితో రేపు జరగబోయే పరమ పవిత్రమైన గరుడ సేవను పురస్కరించుకొని రెట్టింపు ఉత్సాహంతో విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి గరుడోత్సవం దర్శనం కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు.

అదే సమయంలో అత్యవసర వాహనాలకు ఎక్కడ ఆటంకం కలగకుండా మార్గాలను నిత్యం క్లియర్ గా పెట్టుకోవాలన్నారు. విధి నిర్వహణలో మీకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

గరుడోత్సవ దర్శనం చేసుకునేటప్పుడు చిన్నపిల్లలను, వయోవృద్ధులతో వచ్చే భక్తులు తగు జాగ్రత్తలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. క్రైమ్ పార్టీ పోలీసులు భక్తులలో మమేకమై పాత నేరస్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకొని నేర నియంత్రణ చర్యలు చేస్తున్నారన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్డు నుండి మాడవీధులకు, గ్యాలరీలకు అనుసంధానించే క్యూలైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ విధులు నిర్వర్తించే పోలీసు వారు అత్యవసర సమయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా పార్కింగ్ ప్రాంతాలను చేరుకునే మార్గాలను కూడా పరిశీలించి, అక్కడ బందోబస్తు విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది అనునిత్యం అప్రమత్తంగా ఉండాలనీ, అదే సమయంలో స్టెరిలైజింగ్ పార్టీ వారి సహాయంతో రోడ్లపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారు అధికారులను ఆదేశించారు. తిరుమల లోని అన్ని శాఖలను సమన్వయ పరుచుకుంటూ పోలీసులు గరుడోత్సవం సేవను దిగ్విజయంగా పూర్తి చేయాలని ఆశిస్తున్నానన్నారు.

టిటిడి సివి&ఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ ఐపీఎస్., గారు మాట్లాడుతూ శ్రీవారి గరుడోత్సవం సందర్భంగా దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు, ప్రముఖులు అశేషంగా హాజరై, గరుడోత్సవం దర్శనం పొందే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా పోలీసు శాఖ, టిటిడి వారి సమిష్టి కార్యాచరణతో అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసామన్నారు.

భక్తులు ఎంతో సంతోషంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వస్తారు. శ్రీవారి భక్తులకు దర్శనం కల్పించి అంత కన్నా రెట్టింపు సంతోషంగా తిరుమల నుండి వారిని క్షేమంగా తిరిగి పంపించాల్సిన బాధ్యత మనదేనన్నారు. గ్యాలరీలలో సుమారు రెండు లక్షల మంది వరకు భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. వారే కాకుండా బయట గరుడోత్సవ దర్శనం క్యూలైన్లలో సుమారు 20వేల నుంచి 50 వేల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంటుంది. వారందరికీ కూడా గరుడోత్సవం దర్శనం కల్పించి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా విజయవంతం చేయాలని పోలీస్ అధికారులకు టిటిడి సివి&ఎస్ఓ గారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన శ్రీ వెంకట్రావు గారు, నేర విభాగం శ్రీమతి విమల కుమారి గారు, తిరుమల శ్రీ ముని రామయ్య గారు, డీఎస్పీలు గిరిధర ఎస్బి, భాస్కర్ రెడ్డి తిరుమల, రవికుమార్ తిరుమల క్రైమ్, కొండయ్య తిరుమల ట్రాఫిక్, సిఐలు జగన్మోహన్ రెడ్డి తిరుమల 1-టౌన్, చంద్రశేఖర్ తిరుమల 2-టౌన్, అమర్నాథ్ రెడ్డి తిరుమల క్రైమ్, బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న ఇతర జిల్లాల అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *