ప్రపంచంలో శరవేగంగా బలపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత ఆర్థిక వ్యవస్థ ఒకటన్న విషయం తెలిసిందే. గత పదేళ్ల కాలంలో ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్‌, ఇప్పుడు 5వ స్థానంలో నిలిచిందన్న విషయం కూడా కొత్త కాదు. అయితే అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలతో పోల్చితే భారత్‌ ఇంకా వెనుకబడి ఉండగా, వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగానే ఉంది. కానీ ఈ మధ్య యురోపియన్‌ యూనియన్‌ స్థూల జాతీయోత్పత్తిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలోని 25 పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితా తయారు చేసింది. ఈ జాబితాలో కొన్ని అంశాల్లో అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలను భారత్‌ అధిగమించింది. ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ 2024 సంవత్సరానికి గాను రూపొందించిన ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో అత్యధిక ఉఆఖ వృద్ధి రేటు నమోదు చేస్తున్న దేశాలను వరుస క్రమంలో పేర్కొంది. ఇందులో భారతదేశాన్ని శరవేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా తన నివేదికలో పేర్కొంది. అంచనాల ప్రకారం 2024లో భారత వృద్ధి రేటు 7%గా ఉంటుందని, 2025లో అది 6.5%గా నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఇది ప్రపంచంలో ఏ దేశంలో పోల్చుకున్నా అత్యధికం. ఈ రకంగా భారతదేశం అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలను అధిగమించి జీడీపీ వృద్ధి రేటులో మొదటి స్థానంలో నిలిచింది.శరవేగంగా విస్తరిస్తూ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో చైనా 2వ స్థానంలో నిలిచింది. అంచనాల ప్రకారం 2024 సంవత్సరంలో చైనా 5% వృద్ధి రేటు నమోదు చేస్తుందని, 2025 నాటికి అది 4.5%గా ఉంటుందని పేర్కొంది. చైనా ప్రపంచంలోనే 2వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న విషయం తెలిసిందే. వృద్ధి రేటు విషయంలో భారత్‌తో పోల్చితే కాస్త వెనుకబడినప్పటికీ.. భారత్‌ కంటే ఎన్నో రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.జీడీపీ వృద్ధి రేటు విషయంలో చైనాతో సరిసమానంగా పోటీపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఇండోనేషియా నిలిచింది. ఈ దేశంలో 2024 సంవత్సరంలో 5% (చైనాతో సమానంగా) వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఎఓఈ అంచనా వేసింది. 2025 నాటికి ఈ వృద్ధి రేటు మరికాస్త పెరిగి 5.1%గా ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా ప్రస్తుతం ప్రపంచంలో 16వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది.చైనా, ఇండోనేషియా దేశాల తర్వాత 3.6% వృద్ధి రేటుతో టర్కీ వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో నిలిచింది. గత రెండేళ్లుగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా కూడా జాబితాలో టర్కీ తర్వాతి స్థానంలో నిలిచింది. 2024లో 3.2% వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఎఓఈ అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పోలాండ్‌ (3.1%), యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా ?(2.6%), సౌత్‌ కొరియా (2.5%), స్పెయిన్‌ (2.4%), మెక్సికో (2.2%) దేశాలు నిలిచాయి.యూరప్‌ అంటేనే అభివృద్ధి చెందిన దేశాల సమాహారం. ఆ ఖండంలో అనేక దేశాలు ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయి. స్థూల జాతీయోత్పత్తిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఐరోపా ఖండంలో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. వరుసక్రమంలో జర్మనీ తర్వాతి స్థానాల్లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, రష్యా, స్పెయిన్‌ వంటి దేశాలు నిలిచాయి. అదే తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించిన జాబితాలో తొలి స్థానంలో నార్వే (95,510 డాలర్లు) నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో లగ్జెంబర్గ్‌, స్విట్జర్లాండ్‌, ఐర్లాండ్‌, డెన్మార్క్‌, ఐస్‌ల్యాండ్‌, స్వీడన్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్‌ దేశాలు నిలిచాయి. అంటే ఈ దేశాల్లో ఒక్కో పౌరుడి సగటు ఆదాయం ఏడాదికి కనీసం 54,500 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 45.74 లక్షలు) నుంచి గరిష్టంగా రూ. 80 లక్షల వరకు ఉంది. భారత తలసరి ఆదాయం 2021లో 2,150 డాలర్లు (రూ. 1,80,462)గా లెక్కించారు. అంటే యూరప్‌లో 10వ స్థానంలో నిలిచిన దేశంతో పోల్చుకున్నా సరే.. భారత్‌ అనేక రెట్లు వెనుకబడి ఉందని అర్థమవుతుంది.స్తుత ఆర్థిక సంవత్సరం (2024`25) లో భారత్‌ వృద్ధిరేటు తగ్గుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఏప్రిల్‌`జూన్‌ త్రైమాసికంలో అంచనా వేసిన వృద్ధిరేటు కంటే తగ్గి 7.1 శాతానికి పరిమితం అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. 2023`24 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం వృద్ధిరేటు 7.8 శాతం వద్ద నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో మరింత తగ్గుముఖం పట్టింది. సార్వత్రిక ఎన్నికలు, ఉత్పాదకతలో సానుకూల ధొరణుల నేపథ్యంలో జూన్‌ జీడీపీ వృద్ధిరేటు తగ్గి ఉండొచ్చునని అంచనా వేశారు.41 ప్రధాన ఇండికేటర్ల ఆధారంగా భారత్‌ వృద్ధిరేటు తగ్గుముఖం పట్టి ఉండొచ్చునని భావిస్తున్నట్లు ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. వస్తువుల విక్రయాల్లో మోస్తరు వృద్ధిరేటు, మాన్యుఫాక్చరింగ్‌ కంపెనీల్లో సిబ్బంది ఖర్చులు పెరుగుదల వంటి అంశాల ఆధారంగా జీడీపీని ఖరారు చేశారు. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణంలో సానుకూలతలతో వడ్డీరేట్లు తగ్గించేందుకు అవకాశం ఉందని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు తెలిపారు. వివిధ కంపెనీల నికర లాభాలు తగ్గుతాయని, ఉత్పాదకత పడిపోతుందని పేర్కొన్నారు.బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు మినహా కార్పొరేట్‌ కంపెనీల ఆదాయం కేవలం ఐదు శాతం పెరుగుతుందని, నిర్వహణ లాభాలు ఒకశాతం తగ్గుతుందని ఎస్బీఐ ఆర్థిక వేత్తలు పేర్కొన్నారు. 2024`25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనాకు వచ్చారు. ఆర్బీఐ అంచనా వృద్ధిరేటు 7.2 శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *