పదేళ్ల నుంచి బిజెపి అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించాలని భావించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ఎన్డీయే.. 300 మార్క్ సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢల్లీి, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాదాపు క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. యూపీ, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది.దేశం లోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా కూటమి హవా కొనసాగుతోంది. అక్కడి 80 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కూటమి కైవసం చేసుకోబోతుంది.. ఇప్పటికే 40కి పైగా స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం కనబరుస్తోండగా.. బీజేపీ 36 స్థానాల్లో మాత్రమే లీడిరగ్ లో ఉంది. గత ఎన్నికల్లో 62 స్థానాలు ఈ రాష్ట్రం లోనే గెలిచిన బీజేపీకి, ఈ సారి ఎదురు గాలి వీస్తోంది. మహారాష్ట్రలో మొత్తం 48 స్థానాలు ఉండగా.. ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో 26 స్థానాల్లో ఎన్డీయే, 20 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. వెస్ట్ బెంగాల్ లోనూ తృణమూల్ కాంగ్రెస్ హవా కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన టీఎంసీ.. ఈ సారి కూడా 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే, 2019 ఎన్నికల్లో 18 స్థానాలు గెలిచిన బీజేపీ మాత్రం 12 స్థానాల్లోనే లీడిరగ్ లో ఉంది..మెజారిటీ స్థానాలు సాధించాల్సిన పెద్ద రాష్ట్రాల్లోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో.. భారీ మెజారిటీపై అంచనాలు పెట్టుకున్న ఎన్డీయే 3 వందల స్థానాల దగ్గరే ఆగి పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.మరో వైపు కాంగ్రెస్ ఇండియా కూటమిగా ఏర్పడి.. కచ్చితంగా బిజెపిని ఓడిరచి, అధికారాన్ని దక్కించుకోవాలని అంచనా వేసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపించాయి. అయితే వాస్తవ ఫలితాలలో ఆ విషయం ప్రతిబింబించడం లేదు. వార్ వన్ సైడ్ అన్నట్టుగా లేదు.. అలాగని కాంగ్రెస్ కు అధికారం దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం చూసుకుంటే.కర్ణాటక రాష్ట్రంలో ఎన్డీఏ 17 స్థానాలలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ 11 స్థానాలలో పై చేయి సాధించింది.. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ కూడా ముందంజలో ఉన్నాడు.రాజస్థాన్‌లో 25 పార్లమెంటు స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో ఇక్కడ అన్ని స్థానాలను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అయితే ఈసారి ఇక్కడ ఎన్డీఏ 13, కాంగ్రెస్ 11 స్థానాలలో లీడ్ లో కొనసాగుతున్నాయి..ఢల్లీిలో మొత్తం ఏడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం ఆరు స్థానాలలో బిజెపి ముందంజలో ఉంది. ఇండియా కూటమి ఒకే ఒక్క స్థానంలో లీడ్ లో కొనసాగుతోంది.
దేశంలోనే అత్యధిక పార్లమెంటు స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో.. ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 80 పార్లమెంటు స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో.. గత ఎన్నికల్లో బిజెపి 69 స్థానాలు దక్కించుకుంది. కానీ ఈసారి 38 స్థానాలలో బిజెపి, 41 స్థానాలలో ఇండియా కూటమి, ఒకేఒక్క స్థానంలో ఇతరులు లీడ్ లో కొనసాగుతున్నారు.పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి, ఎన్డీఏ మధ్య పోరు రసవత్తరంగా ఉంది.. 42 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఎన్డీఏ 16, ఇండియా కూటమి 26 స్థానాలలో ఆధిక్యం లో కొనసాగుతున్నాయి. బిజెపి ఈ రాష్ట్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ.. మమతా బెనర్జీ పై చేయి సాధించారు.ఇక ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం ఎన్డీఏ కూటమి 277 స్థానాలలో లీడ్ లో ఉంది. 13 స్థానాలలో సాధించింది. కాంగ్రెస్ 189 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఏడుగురు అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించారు. ఇతరులు 56 స్థానాలలో లీడిరగ్ లో ఉన్నారు.4: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లో తీవ్రంగా నష్టపోయిన బీజేపీ అధికారంలో లేని ఒడిశా, ఢల్లీి, బిహార్‌లో సత్తా చాటుతోంది. ట్రెండ్స్ చూస్తుంటే బిహార్‌లో ఎన్డీఏ కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. ఢల్లీి, మధ్య ప్రదేశ్‌లో బీజేపీ ఒంటరిగా క్లీన్‌స్వీప్ చేస్తోందిబిహార్లో 40 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ జేడీయూ 25 స్థానాల్లో, బీజేపీ 15 స్థానాల్లో పోటీ చేశారు. అన్ని స్థానాల్లో ఎన్డీఏ ఆధిపత్యం కనబరుస్తోంది.ఇక ఢల్లీిలో ఆప్ అధికారంలో ఉంది. ఇక్కడ ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా ఆరింటిలో ఆప్, ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేశాయి. అన్ని స్థానాల్లో బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. లిక్కర్ స్కామ్ ప్రభావం ఇక్కడి ఎన్నికలపై స్పష్టంగా పడిరది.ఇక మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లోనే బీజేపీ తన పట్టు నిలుపుకుంది. యూపీ, రాజస్థాన్‌లో బీజేపీ పట్టు సడలింది. మధ్యప్రదేశ్‌లో మాత్రం 25 స్థానాలకు 25 గెలిచేలా ట్రెండ్స్ వస్తున్నాయి.4: దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ స్థానాలను బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 2024లో మాత్రం ఇక్కడి ఫలితాలు బీజేపీకి షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే? ఇండియా కూటమి ఆధిక్యత కనబరుస్తోంది. 2019లో 80 స్థానాలకు 62 స్థానాలు గెలిచింది. ఎన్డీ కూటమికి చెందిన అప్నాదల్ 2 స్థానాల్లో గెలిచింది. మాయావతి ఒంటరిగా పోటీ చేసి 10 స్థానాలు గెలిచింది. సమాజ్‌వాదీ పార్టీ 5, కాంగ్రెస్ ఒక్క సీటు గెలిచాయి.ఈసారి అప్నాదళ్‌తోపాటు జయంత్‌చౌదరి నేతృత్వంలో ఆర్ఎస్ఎల్ డీ, సులేప్ాదేవ్, భారతీయ సమాజ్ పార్టీ ఎన్డీయే కూటమి పోటీ చేశాయి. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ 52 స్థానాలకు, కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేశాయి. బీఎస్పీ ఒంటరిగా బరిలో నిలిచింది.