అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా అనంతరం కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ఈ డిమాండ్ల సాధన కోసం కృషి చేయాలని వారు కోరడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ , ఐఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టిపల్లి సాయికుమార్ మద్దతు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు మూడు వేలకు పెంచాలి పెండింగ్లో ఉన్న మెస్ కాస్మాటిక్ ఛార్జీలు విడుదల చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి. హానర్స్ డిగ్రీ విధానాన్ని రద్దు చేయాలి మూడేళ్ల డిగ్రీ కొనసాగించాలి ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియ రద్దు చేయాలి ప్రభుత్వ పాఠశాలలలో మధ్యాహ్న భోజనానికి 20 రూపాయలు కేటాయించాలి ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదు ఖాళీగా ఉన్న అధ్యాపక ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలి జాతీయ విద్యా విధానం 2022 రద్దు చేయాలి మూడు నాలుగు ఐదు తరగతులు విలీనం ఆపాలి జీవో నెంబర్ 77 రద్దుచేసి ప్రైవేట్ ఏడేటి విద్యాసంస్థలలో పీజీ చదువుతున్న విద్యార్థులకు విద్యాదేవన వసతి దీవెన పథకాల అమలు చేయాలి బాలికల హాస్టల్ లో విద్యార్థులకు సానిటరీ పాడ్స్ అందజేయాలి యూనివర్సిటీ కి నిధులు కేటాయించాలి కామన్ పీజీ ప్రవేశ పరీక్ష రద్దు చేయాలి స్వయంప్రతిపత్తి కాపాడాలి.అని డిమాండ్ చేశారు ఈ సమస్యలు పరిష్కరించకపోతే చలో విజయవాడ సీఎం కామ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఐఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర చందు జిల్లా కమిటీ సభ్యులు చిన్న రెడ్డియ్య సునీల్ నాయక్ బబ్లు, మోహన్ సోను సుకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.