కమ్యూనికేషన్ మరియు సాఫ్ట్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థుల కోసం కమ్యూనికేషన్ , మరియు సాఫ్ట్ స్కిల్స్ అంశాల ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతపై మంగళవారం నాడు అవగాహన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య రిసోర్స్ పర్సన్ గా మ్యాక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ , హైదరాబాద్ కు చెందిన కార్పొరేట్ ట్రైనర్ నోసిన మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తన జీవిత గమ్యాన్ని నిర్దేశించుకోవాలని మరియు గమ్యాన్ని చేరడానికి అంకిత భావం ,కృషి ,పట్టుదల ధనాత్మక ఆలోచన, ఒత్తిడిని జయించడం రియు మంచి నడవడికతో అడుగులు వేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పాత్ర ఉద్యోగ అన్వేషణలో కీలకమని, భావవ్యక్తీకరణ నైపుణ్య అభివృద్ధి తో విషయాన్ని ఎదుటివారికి క్లుప్తంగా వివరణ ఇవ్వడం, ఆత్మన్యూనతా భావాన్ని తొలగించుకుని కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకుంటే విజయం మీ వెంటే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ స్కిల్స్ మరియు తరచుగా ఇంటర్వ్యూ సమయంలో ఎదురయ్యే ప్రశ్నలు మరియు వాటికి సమాధానాలు పై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ M.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలో ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ విద్యార్థులకు మోటివేషన్, కమ్యూనికేషన్ స్కిల్ ,అర్థమెటిక్ మరియు రీజనింగ్ అంశాలపై అందిస్తున్న ప్రత్యేక శిక్షణను కళాశాలలోని డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకుని ఉన్నత స్థానాలు అందుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, అంకితభావంతో చదువుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని కళాశాలలో నిర్వహిస్తున్న ప్రతి అవగాహనా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు .ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి. బాలాజీ వివిధ విభాగాల అధిపతులు ,అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.