హైదరాబాద్‌, అక్టోబరు 18: లంగాణ ఎన్నికల్లో బీజేపీ గేర్‌ మార్చినట్టు కనిపిస్తోంది. ఓ వైపు అభ్యర్థులను ఖరారు చేసే కసరత్తు చేస్తూనే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. అందులో భగంగానే జనసేన మద్దతు కోరారు. పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేకంగా సమావేశమైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది.తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ త్వరలోనే రానుంది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించేసి రాజకీయ రణ క్షేత్రంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్‌ కూడా మొదటి జాబితాను ప్రకటించింది. ఇవాళ్టి నుంచి రాహుల్‌ , ప్రియాంక తెలంగాణలో పర్యటించనున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా స్పీడ్‌ పెంచినట్టు కనిపిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *