హౖదరాబాద్‌: కాంగ్రెస్‌ బస్సుయాత్ర? తుస్సుమనడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్‌ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్‌ ఎందుకు నోరుమెదపలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు. విభజన హావిూలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హావిూలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ విూది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హావిూలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్‌ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు విూరని అన్నారు.
రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తూ:
తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు. కరప్షన్‌ కు కేరాఫ్‌… కాంగ్రెస్‌. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..
దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టింది విూరు. ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవి బిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌ కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే. వందల మంది బలిదానాలకు కారణం.
మాఫియాకు కేరాఫ్‌ విూ పీసీసీ చీఫ్‌ . టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న
రాబందు… రేవంతని ఆరోపించారు. రిమోట్‌ పాలన గురించి విూరా మాట్లాడేది.. ?? రిమోట్‌ కంట్రోల్‌ పాలనకు కేరాఫ్‌ విూ టెన్‌ జనపథ్‌. మా ప్రభుత్వ రిమోట్‌ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది. గాంధీభవన్‌ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది. మూడు రోజుల పర్యటన చేసినా.. మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ ను నమ్మరు. వైఫల్యాల కాంగ్రెస్‌ ను ఎప్పటికీ విశ్వసించరని అయన మండిపడ్డారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *