వీరబల్లి (రాజంపేట నియోజకవర్గం): జగన్ నువ్వు టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకున్నావ్.. త్వరలో నిన్ను ప్రజలే ఓటు అనే ఆయుధంతో ముంచేస్తారంటూ టిడిపి రాజంపేట సీనియర్ నేత చమర్తి జగన్ రాజు గారు హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు కు నిరసన గా వీరబల్లి టిడిపి మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం వీరబల్లి మండలం ఉప్పరపల్లెలోని దేవదాశి చెరువులో టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి చమర్తి జగన్ రాజు గారు జలదీక్ష చేపట్టి నల్ల బెలూన్ లను ఎగరవేసి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు యం.భానుగోపాల్ రాజు, మట్లి సర్పంచ్ నాగార్జున ఆచారీ, టిడిపి సీనియర్ నాయకులు రామ్మోహన్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్రామ రాజు, టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ రాజు, టిడిపి నాయకులు దుర్గం ఆంజనేయులు, వీరబల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ఆంజనేయులు రెడ్డి, తుమ్మల రమేష్, తెలుగుయువత పార్లమెంటు కార్యదర్శి నేతి రమేష్ బాబు, గుదె నాగార్జున, సాయి కుమార్ వాసు. మహేంద్ర. రాజా. సీతారామ. వీరామృత నాయుడు.సుధాకర్, మహేష్. సుబ్బరామ రాజు. నాగప్పనాయుడు, తదితరులు పాల్గొన్నారు.