తాడేపల్లి: చంద్రబాబుకు రివర్స్ వెన్నుపోటు పొడిచేందుకు లోకేష్, బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. బాలకృష్ణ, లోకేష్ కలిసి టిడిపిని కబ్జా చేయాలని, పదవి లాక్కోవాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అచ్చెం నాయుడు పాత్రని అసెంబ్లలీలో బాలకృష్ణ పోషిస్తున్నాడు..యనమల కూడా కుర్చీని కైవసం చేసుకోవాలని చూస్తున్నారు.. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన పాపం పోదు కదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు నీతిమంతుడు అయితే ఎందుకు అసెంబ్లీలో చర్చకు రాకుండా టీడీపీ నేతలు పారిపోయారని మంత్రి నిలదీశారు చంద్రబాబు అవినీతి చేయలేదని ఎన్టీఆర్ ఫ్యామిలీ, కార్యకర్తలు, ప్రజలు నమ్మరన్న ఆయన.. చంద్రబాబు 14 ఏళ్లు స్కాములే చేశారని ఆరోపించారు. అసలు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ని అమెరికా ఎందుకు పంపారు? అని నిలదీశారు. బొంకడం మాత్రమే తెలుసు చంద్రబాబు కి.. చంద్రబాబు వి స్కామ్‌లు.. వైయస్ జగన్ వి స్కీమ్‌లు అని అభివర్ణించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు శనివారం మీడియాతో మాట్లాడారు.