కడప, అక్టోబరు 17:వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఆధారాలు సేకరించామంటున్నారు … ఛార్జిషీట్లు దాఖలు చేశారు.. అయినా పోలీసులు మాత్రం కడప ఎంపీఅవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం లేదు… ఒక మాజీ మంత్రి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ అరెస్టు కాకపోవడానికి కారణమేంటి?… ఆయన తండ్రి జైల్లో ఉన్నా.. సదరు ఎంపీ మాత్రం ఎందుకు అరెస్ట్ కావడం లేదు?…చంద్రబాబుని అరెస్ట్ చేయడానికి చకచకా చర్యలు చేపట్టిన జగన్ సర్కారు… సొంత ఎంపీ విషయంలో విూనమేషాలు లెక్కిస్తుండటంపై సోషల్ విూడియాలో వినిపిస్తున్న టాక్ ఏంటి?
ఏపీలో వైసీపీ ప్రభుత్వ రాజకీయం ఎవరికీ అంతుపట్టకుండా తయారవుతోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది … అక్రమార్జన కేసులో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన జగన్ … సదరు అవినీతి మరకలను అందరికీ అంటించేపనిలో ఉన్నారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు … అదే సమయంలో ఆరోపణలు వచ్చాయి కాబట్టే … చంద్రబాబును అరెస్ట్ చేసి సీఐడీ అధికారులు విచారణ చేస్తున్నారంటున్న …ఏపీ ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సోషల్ విూడియాలో నెటిజన్‌లు కౌంటర్లు ఇస్తున్నారు.మరి బాబాయ్ వైఎస్ వివేకాను హత్య చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నలు గుప్పిస్తున్నారు …. ఆర్ధికపరమైన కేసులో ఆరోపణలు ఉంటేనే అరెస్ట్ చేసిన పోలీసులు.. మర్డర్ కేసులో స్పష్టమైన ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదోకూడా సజ్జల వివరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.