తిరుపతి, అక్టోబరు 16: చంద్రబాబుపై కేసు నమోదు చేయడం తప్పు.. బాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్‌ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌.. రాహుల్‌ గాంధీ లాగా , చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.. చంద్రబాబును 37 రోజులుగా జైలులో పెట్టడం తప్పు.. వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు? కోర్టుల్లో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తోందన్నారు.. చంద్రబాబును తక్షణమే జైలు నుంచి విడుదల చెయ్యాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు తప్పు చేసినట్లు రుజువులు ఉన్నాయా? అని నిలదీశారు. చంద్రబాబు పై కేవలం ఆరోపణలు మాత్రమే ఉన్నాయని గుర్తుచేశారు.వాజ్‌ పాయ్‌, పీవీ నరసింహారావు కుట్రల ఫలితంగా అప్పట్లో అద్వానీపై కేసులు పెట్టారన్నారు చింతా మోహన్‌.. దాని ఫలితంగా అద్వానీ ప్రధాని కాలేక పోయారన్నారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందనే నమ్మకాన్ని వ్యక్తం చేశరాఉ.. తెలంగాణలో 75 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందన్నారు. ఇక, తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్నాయి.. కాంగ్రెస్‌ తో జతకట్టిన పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ` జనసేన పొత్తును ఆహ్వానిస్తున్నాం అన్నారు. 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు ఏపీలో కాంగ్రెస్‌ కు పెరిగిందన్నారు. మా పార్టీతో కలసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ 2005లో రాజ్యంగ సవరణ ద్వారా చట్టం చేసి 27శాతం ఓబీసీ లకు రిజర్వేషన్లు ఇచ్చింది.. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదన్నారు. రాజకీయంగా కూడా అన్ని రాజకీయ పక్షాలు ఓబీసీలకు రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్‌.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *