చంద్రబాబు ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే
చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు
చాగలమర్రి:టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్య బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ భాష అన్నారు. ఆదివారంస్థానిక రిక్వెస్ట్ స్టాప్ వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు, భూమా అభిమానులు తమ చేతులకు తాళ్లు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూన్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్యాలెస్ లోని పిచ్చి జగన్ కుట్రలు దేశానికి చాటేలా ఐదు కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా చంద్రబాబుకు సంఫీుభావం తెలిపామన్నారు. న్యాయానికిఇంకెన్నాళ్లు ఈ సంకెళ్లు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా పోరాటాలకు సిద్ధమన్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కొలిమి హుస్సేన్ వల్లి, సల్ల నాగరాజు ,గుత్తినరసింహులు, మౌలాలి, క్లస్టర్ ఇంచార్జి అజిముద్దీన్, ప్రచార కార్యదర్శి గఫార్, ప్రధాన కార్యదర్శి హనీఫ్, బీసీ సంఘం నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, బషీర్ ,వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి, ఓబులేసు శంకరసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.