రామాపురం మండల మాజీ ఎంపీపీ నసిరున్ సుల్తానా ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స అనంతరం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు స్థానిక నాయుకుల ద్వారా విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గడికోట ద్వారకనాథ్ రెడ్డి సోమవారం ఉదయం కడపలోని మాజీ ఎంపీపీ స్వగృహంలో నసీరున్ సుల్తానా ను పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థులు అడిగి తెలుసుకున్నారు, అనంతరం మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ దేవుని ఆశీస్సులతో నసిరున్ సుల్తానా గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకోవాలని ఆకాంక్షించారు.