జిల్లా కేంద్రం  అధునాతన హంగులతోజిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణం ఉండేలా చర్యలు

శాశ్వత కలెక్టర్ బంగ్లా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి

అన్నమయ్య జిల్లా , రాయచోటి అభివృద్ధిలో మరో ముందడుగు జిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి భూమి పూజ జరగడమని లోక సభ స్పీకర్ పానెల్ స్పీకర్ ఎంపీ మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాష, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష లు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక రాయచోటి కలెక్టరేట్ వెనుక, స్టేట్ గెస్ట్ హౌస్ వెనుక వైపున ఉన్న స్థలంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ బంగ్లా నిర్మాణానికి జరిగిన భూమిపూజలో ముఖ్య అతిధులుగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాష, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష,కార్మిక, కర్మాగారాముల , బాయిలర్ల మరియు ఇన్స్యూ రెన్స్ వైద్య సేవల ప్రభుత్వ కార్యదర్శి హరిజవహర్ లాల్, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష లు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ గిరీష బంగ్లాకు సంబంధించిన ప్లాన్ ను శంకుస్థాపన కార్యక్రమం దగ్గర ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల ద్వారా …. ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాష జ్ ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లకు వివరించారు.
**”
వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధజలం:.ఎంపీ మిథున్ రెడ్డి

వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి గ్రామానికి శుద్ధజలం అందిస్తామని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వాటర్ గ్రిడ్ టెండర్ పూర్తి అయిందని, సర్వే జరుగుతోందన్నారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషితో జిల్లా కేంద్రం అభివృద్ధి జరుగుతోందన్నారు. ఎంఎల్ఏ నవాజ్ బాష కృషితో మదనపల్లె కు మెడికల్ కళాశాల, బిటి కళాశాలను యూనివర్సిటీ గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. చంద్రబాబుపై పూర్హి ఆధారాలతోనే కేసు నమోదు అయిందన్నారు. తప్పు చేయకుంటే చంద్రబాబు, లోకేష్ పిఏలు విదేశాలకు ఎందుకు పారి పోయారున్నారు.
 నాలుగేళ్ళ పాలనా కాలంలో 99 శాతం హామీలును నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుంది: వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి 
నాలుగేళ్ళ పాలనా కాలంలో 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. చెప్పింది చెప్పినట్లుగా జగన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల చెంతకే వైద్యం అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలోని దివ్యాoగులను ఆదుకునేందుకు ఎంపీ మిథున్ కృషి చేస్తుండడం అభినందనీయమన్నారు. ఢిల్లీ స్థాయిలో ప్యానెల్ స్పీకర్ గా రూలింగ్ లు ఇస్తుండడం చూస్తుంటే పార్లమెంట్ లోని ప్రజలందరూ గర్వపడుతుంటే టీడిపి శ్రేణులు అసూయపడి కడుపు మంటతో విమర్శలు చేస్తున్నారన్నారు.
*
జిల్లా కేంద్రంలో అభివృద్ధి పరుగులు:
జిల్లా కేంద్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. స్టేడియం, రహదారుల విస్తరణ, వంద పడకల ఆసుపత్రి, ఆర్ టి సి బస్ స్టాండ్ విస్తరణ, రైతు బజార్, టి టి డి కళ్యాణ మండపం, ట్రాఫిక్ పోలీసు స్టేషన్, డి ఎస్ పి కార్యాలయం , మున్సిపల్ సభాభవనం తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సీఎం జగన్,ఎంపీ మిథున్ ల సహకారంతో నియోజక వర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.

చంద్రబాబు తప్పులు చేసి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఏంటి?

చంద్రబాబు తప్పులు చేస్తే ,టి డి పి వారు ప్రభుత్వం పైన విమర్శలు చేస్తుండడం మంచి పద్ధతి కాదన్నారు.స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అడ్డంగా దొరికారన్నారు. స్కిల్ స్కాం రూ 300 కోట్లే కదా, చంద్రబాబును వదిలివేయొచ్చు కదా అని టి డి పి శ్రేణులు మాట్లాడుతున్నాయని, రూ 10 లక్షల స్కాములో చిదంబర్ నకు శిక్ష పడిందని, లాలూ ప్రసాద్ యాదవ్ కు శిక్ష పడిన విషయాలును ఆయన గుర్తు చేశారు.
*
ప్రజలకు మేలు చేయడమే సీఎం జగన్ అజెండా:

ప్రజలకు మేలు చేయడమే సీఎం జగన్ అజెండా అని అన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగుతోందన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా, విలేజ్ హెల్త్ క్లినిక్ ల భవనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జిల్లాలోని మెడికల్ కళాశాల ను మంజూరు చేయడం జరిగిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.

జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు జరుగుచుండడం హర్షదాయకం: ఎంఎల్ఏ నవాజ్ బాష
జిల్లా కేంద్రం రాయచోటిలో అభివృద్ధి పనులు జరుగుచుండడం హర్షదాయకమని మదనపల్లె ఎంఎల్ఏ నవాజ్ బాష అన్నారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి, పట్టుదల అభినందనీయమన్నారు.
నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి: జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి

ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లా కలెక్టర్ గిరీష చొరవతో కలెక్టర్ కు శాశ్వత బంగాళా నిర్మాణం జరుగుతోందని, నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తున్నానని తెలిపారు.

జిల్లా కేంద్రం అభివృద్ధికి మరిన్ని చర్యలు: జిల్లా కలెక్టర్ గిరీష

జిల్లా కేంద్రం అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ గిరీష తెలిపారు. ఇటీవలనే డైట్ మున్సిపల్ పార్క్ ను ప్రారంభించు కున్నామన్నారు. శిల్పారామం పనులు మొదలవుతున్నా యన్నారు. నాలుగు వరుసల రహదారి అభివృద్ధి పనులు త్వరలో పూర్తి అవుతాయన్నారు. ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి కృషి తో రాయచోటి పట్టణం అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.

ఎంపీ, ఎంఎల్ఏ లకు ఘన స్వాగతాలు:

కలెక్టర్ బంగ్లా నిర్మాణ భూమి పూజకు విచ్చేసిన ఎంపీ మిథున్ రెడ్డి,ఎంఎల్ఏ లు శ్రీకాంత్ రెడ్డి, నవాజ్ బాష, జెడ్ పి చైర్మన్ ఆకేపాటి అమరనాధ రెడ్డి లకు స్థానిక నాయకులు, కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణ, జిల్లా ఆర్ అండ్ బి అధికారి సహదేవరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ ఛైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, తబ్రేజ్ ఖాన్, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, జెడ్ పి టి సిలు వేంకటేశ్వర రెడ్డి, మాసన వెంకట రమణ, ఎంపిపి మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి,రాజేంద్ర నాధ్ రెడ్డి (వీరబల్లె), మాజీ జెడ్ పి టి సి గొర్ల ఉపేంద్రా రెడ్డి, ఏపిఐఐకో డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, బీసీసెల్ విజయభాస్కర్, రామాపురం వైస్ ఎంపిపి రవిశంకర్ రెడ్డి,జె సి ఎస్ కో కన్వీనర్ అమరనాధ రెడ్డి, కౌన్సిలర్లు సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, సుగవాసి శ్యామ్, మదన మోహన్ రెడ్డి, ఆసీఫ్ అలీ ఖాన్, కసిరెడ్డి వెంకట నరసింహా రెడ్డి, కొలిమి ఛాన్ బాష, షబ్బీర్, ఫయాజ్ అహమ్మద్, మురికినాటి వెంకట్రామిరెడ్డి, రౌనక్, అల్తాఫ్, జయన్న నాయక్, భాస్కర్, పార్టీ పట్టణ అధ్యక్షుడు రియాజర్ రెహమాన్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజిబాబు, జాఫర్, ఇరఫాన్, నవరంగ్ నిస్సార్, పొదలపల్లె గోపాల్ రెడ్డి, ఆర్ట్స్ శంకర్,కో ఆప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, ఆసీఫ్ అలీఖాన్, హజరత్ ఖాదర్ వలీ, ఎంపిటిసి రామచంద్రా రెడ్డి, మాధవరం రమేష్ రెడ్డి, నాయకులు జి ఎం డి ఇమ్రాన్, కొత్తపల్లె ఇంతియాజ్, ఇర్షాద్, కొత్తిమీర ప్రసాద్, విక్కీ దేవేంద్ర, జావీద్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *