టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ‘‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’’ కార్యక్రమం
` చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లో వినూత్న కార్యక్రమం
` ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మెట్రోలో ప్రయాణం
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ అభిమానులు శనివారం లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం నిర్వహించారు. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణం చేసారు. చంద్రబాబుకు మద్దతుగా చేస్తున్నట్లు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వెల్లడిరచారు. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో లో వెళ్తున్న నిరస
నకారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చ మెట్రో రైల్ నుంచి వారిని బలవంతంగా కిందకు దింపి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నిరసనకారుల నినాదాలతో మోట్రో స్టేషన్లు హోరెత్తాయి