నిరుద్యోగులారా బతికి సాధిద్దాం
ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు
న్యూఢల్లీి: నిరుద్యోగులారా బతికి సాధిద్దాం. ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు.వచ్చేది మన ప్రభుత్వమే. కడుపు నిండా ఉద్యోగాలు ఇచ్చుకుందాం. చేతులెత్తి మొక్కుతున్నా. తల్లి తండ్రులకు కడుపుశోకం మిగిల్చకండని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గ్రూప్ 2 వాయిదాతో వరంగల్ కి చెందిన ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల తీవ్రగ్భ్భ్రాంతి కి గురిచేసింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యనే. ప్రవళిక ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆమె ఆత్యహత్య ను తీవ్రంగా ఖండిస్తున్నాను. 4 కోట్ల ప్రజలు కూడా ఆమె ఆత్మహత్య ను ఖండిరచాలని అయన అన్నారు.
ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలి వారి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సగ్రేషియా ప్రకటించాలి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు చనిపోతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పదేళ్ల లో ఒక్క గ్రూప్ పరీక్ష నిర్వహించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. నీళ్లు నిధులు,నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాల కోసం చచ్చిపోతున్నారు. ఉద్యోగాల కోసం యువకులు పిచ్చోళ్ళలాగా తిరుగుతూ కుటుంబాలకు దూరం అవుతున్నారు. నిరుద్యోగుల ఉసురు ముట్టి ఈ ప్రభుత్వం మట్టి కొట్టుకపోతుంది. నిరుద్యోగులారా రెండు నెలలు ఓపిక పట్టండి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా ఇస్తామని అయన అన్నారు. .
