‘మడితాటి’కి ప్రధాని
మోడీ నుండి ప్రశంసాపత్రం

అన్నమయ్య జిల్లా జిల్లా:సంబేపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న మడితాటి నరసింహారెడ్డికి గురువారం ఉదయం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి ప్రశంసా పత్రం అందింది. విద్యార్థులలో ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి నిర్వహించిన ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంపై ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి విలువైన సూచనలు చేశారని అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ప్రశంసా పత్రంలో ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి కలలు కనేలా,
ఆ కలలను సాకారం చేసేందుకు అతని సామర్ధ్యాలను సక్రమంగా ఉపయోగించేలా ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం ఇవ్వాలన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు
మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ దేశం కోసం, విద్యార్థుల అభివృద్ధి కోసం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో తాను పంచుకున్న ఆలోచనలు, అభిప్రాయాలు చాలా విలువైనవని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుండి ప్రశంసాపత్రం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రశంసా పత్రాన్ని తన జీవితంలో అత్యంత విలువైనదిగా భావిస్తానన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *