కడప: జమ్మలమడుగు సబ్`డివిజన్ పరిధిలోని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పరిసరాలు పరిశీలించారు. ఆవరణలో పచ్చదనం పెంపొందించాలని, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. దొంగతనాలు అరికట్టేందుకు గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల సమన్వయంతో నాటుసారా, అక్రమ మద్యంపై దాడులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ‘దిశ’ రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కు చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ వెంట జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు, సి.ఐ ఈశ్వరయ్య, ఎస్.ఐలు కృష్ణంరాజు నాయక్, ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఉన్నారు.