దేశానికే ఆద‌ర్శం జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌

రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి  దేశానికే ఆద‌ర్శంగా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌ నిలుస్తోందని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం రాయచోటి మున్సిపాలిటీలోని బండ్లపెంట దర్గా పట్టణ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం సందర్శనలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష తో కలసి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.శిబిరం నందు ఓపి నమోదు కేంద్రం,రోగులను వైద్యులు పరీక్షించు కేంద్రాలు, రక్త పరీక్షలు నిర్వహించు కేంద్రం, మందులు పంపిణీ కేంద్రాలును శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు.రోగులతో శ్రీకాంత్ రెడ్డి మమేకమయ్యారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా, రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రి ఆరోగ్య వివ‌రాల‌ను న‌మోదు చేసి, అవ‌స‌ర‌మైన వారంద‌రికీ వైద్యం అందించ‌డమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమన్నారు రాష్ట్రంలో సుమారు కోటి, 63 ల‌క్ష‌ల కుటుంబాల్లోని దాదాపు ఐదు కోట్ల మందికి చెందిన ఆరోగ్య డేటాను సేక‌రించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. జ‌గ‌నన్న ఆరోగ్య సుర‌క్ష కార్యక్ర‌మం ద్వారా ఏడు రకాల ఆరోగ్య, వైద్య‌ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించి, మందుల‌ను ఉచితంగా అంద‌జేసి, ఇంకా మెరుగైన వైద్యం అవ‌స‌ర‌మైన‌ వారికి ఇత‌ర ఆసుప‌త్ర‌ల‌కు రిఫ‌ర్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ముఖ్యమంత్రి ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చేందుకు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలి…

రోగులుకు అవసరమైన రక్త పరీక్షలన్నీ నిర్వహించాలి:

ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష, ఆశయాలను నెరవేర్చేందుకు అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేయాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు వచ్చిన రోగులను వాలంటీర్లు ,వైద్య సిబ్బంది చేయిపట్టుకును,దగ్గరుండి అవసరమైన రక్త పరీక్షలను చేయించి,వైద్యం అందేలా చేసి రోగులు సంతృప్తి చెందేలా చూడాలన్నారు. తూతూ మంత్రంగా శిబిరాలు నిర్వహిస్తే సహించమని ఆయన హెచ్చరించారు.ప్రతి రోగికి నిదానంగా వైద్య పరీక్షలు, వైద్యం అందేలా చూడాలన్నారు. ప్రతి శిబిరాన్ని స్పెషల్ ఆఫీసర్ పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గిరీష ను శ్రీకాంత్ రెడ్డి ఫోన్ ద్వారా కోరారు. ఆరోగ్యశ్రీ పరిధిలో రాకుండా ,అత్యధిక ఖర్చుతో కూడుకున్న జబ్బులున్న వారి వివరాలు తెలిపితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి వారికి వైద్యం అందే బాధ్యత తనదేనన్నారు.

శిబిరాలలో ప్రజాప్రతినిధులు భాగస్వామ్యులు కావాలి:

జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలలో కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితర ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. రోగులకు భోజనవసతి సౌకర్యాలును స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ కొండయ్య, మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్,సీనియర్ నాయకులు జమాల్ ఖాన్, వైస్ చైర్మన్ ఫయాజర్ రెహమాన్, మదనపల్లె పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తబ్రేజ్ ఖాన్, కౌన్సిలర్లు పద్మావతి, ఆసీఫ్ అలీఖాన్,సుగవాసి ఈశ్వర్ ప్రసాద్,ఫయాజ్ అహమ్మద్, సుగవాసి శ్యామ్, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,ఇర్షాద్,కో ఆప్షన్ సభ్యులు అయ్యవారు రెడ్డి, హజరత్ ఖాదర్ వలీ, ముదిరాజ్ యువసేన జిల్లా కార్యదర్శి విక్కీ దేవేంద్ర, జావీద్,అమీర్, వైద్యాధికారులు డా మహేశ్వర రాజు,డా ప్రసాద్, ఎం పి హెచ్ ఈ ఓ ప్రసాద్ బాబు యాదవ్,
మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *