యాత్ర 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదల
‘యాత్ర 2’ ఫస్ట్‌ లుక్‌ విడుదలI Iవై.ఎస్‌.ఆర్‌గా మమ్ముట్టిÑ వై.ఎస్‌.జగన్‌ పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ జీవాI మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో త్రీ ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌, శివ మేక సంయుక్తంగానిర్మిస్తోన్న చిత్రం ‘యాత్ర 2’. ఈ సినిమాలో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి, వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర యూనిట్‌ సోమవారం విడుదల చేసింది. వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డిపాత్రలో మలయాళం సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, వై.ఎస్‌.జగన్‌ పాత్రలో కోలీవుడ్‌ స్టార్‌ జీవా నటిస్తున్నారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను గమనిస్తే, మమ్ముట్టి, జీవా ఇన్‌టెన్స్‌ లుక్స్‌తో కనిపిస్తున్నారు. ‘నేనెవరో ఈప్రపంచానికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…నేను వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి కొడుకుని’ అనే ఎమోషనల్‌ డైలాగ్‌ను కూడా పోస్టర్‌లో గమనించవచ్చు. పోస్టర్‌ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఏపీదివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్రజాదరణను పొందిన ఈ చిత్రంకు కొనసాగింపుగా, వైఎస్‌.ఆర్‌ తనయుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఇప్పుడు ‘యాత్ర 2’ని తెరకెక్కిస్తున్నారు. ‘యాత్ర’ చిత్రాన్నిఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకుసిద్ధమవుతుంది. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మది కెమెరామెన్‌. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *