కోయంబత్తూర్‌ అక్టోబర్‌ 25:’’33 సంవత్సరాల తర్వాత నా గురువు, రోల్‌ మాడల్‌, అమితాబ్‌ బచ్చన్‌తో మళ్లీ కలిసి నటిస్తున్నా.. నా గుండె ఆనందంతో కొట్టుకుంటుంది అంటూ రజనీకాంత్‌ రాసుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. జైలర్‌తో వీర లెవల్లో కంబ్యాక్‌ ఇచ్చిన రజనీ ఇప్పుడు అదే ఊపుతో తన 170వ సినిమా చేస్తున్నాడు. జై భీమ్‌ దర్శకుడు ు.ఏ జ్ఞానవేల్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఓ మేజర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి రజనీ కాంత్‌ ఓ సాలిడ్‌ న్యూస్‌ పంచుకున్నాడు.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కీ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అమితాబ్‌ తలైవర్‌ 170 షూటింగ్‌లో జాయిన్‌ అయ్యాడు. చివరిసారిగా వీరిద్దరూ ముకుల్‌ ఆనంద్‌ దర్శకత్వంలో 1991లో ‘హమ్‌’ చిత్రంలో కలిసి నటించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *