రాయచోటి, అక్టోబర్ 08: యూపీఎస్ సి నిర్వహించిన పరీక్షల్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎంపికైన రాయచోటి శ్రీ దేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ కాలేజ్ పూర్వ విద్యార్థి బి.ధర్మ నాయక్ ను ఆ కళాశాల కరస్పాండెంట్ , టీటీడీ గోశాల మెంబర్ దేవపట్ల రామ సునీల్ రెడ్డి ఆదివారం కాలేజ్ లో ఘనంగా శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ డి హెచ్ ఆర్ కరెస్పాండెంట్ మరియు టిటిడి గోశాల మెంబర్ డి.రామ్ సునీల్ రెడ్డి మాట్లాడుతూ….కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ గా బి.ధర్మ నాయక్ విధులు నిర్వహిస్తున్నారన్నారు. తమ కళాశాలలో చదువుకొని ఉన్నత ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంకా బాగా పనిచేసి ఉన్నత స్థాయికి అధిరోహించాలన్నారు.అందులో భాగంగా బి ధర్మ నాయక్ ను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సన్మానంలో ఎస్ డిహెచ్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ రెడ్డప్ప రెడ్డి, ఇంచార్జి జనార్దన్ రెడ్డి, కళాశాల సిబ్బంది పీరా, రెడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *