ప్రతి విద్యార్థిలో నైతిక విలువలు అలవర్చుకోవాలి…

మానవత సంస్థ అధ్వర్యంలో నైతిక విలువల పై అవగాహన సదస్సు….

విద్యార్థి దశ నుండే విద్యార్థులలో నైతిక విలువలు అలవర్చుకోవాలన్నారు మానవతా చైర్మన్ అరమటి శివగంగి రెడ్డి,అధ్యక్షులు చింతం వెంకట్రాంరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శివ శంకర్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట సుగువాసి రాజారాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు మానవత అధ్యక్షులు చింత వెంకటరామి రెడ్డి , చైర్మన్ అరమాటి శివగంగి రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు ఆనంద రెడ్డి,మాజీ అధ్యక్షులు గుండ్లపల్లి వెంకటేష్,రామచంద్ర రెడ్డి ల అధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువల పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులలో క్రమశిక్షణ, మంచితనం పెద్దలను గౌరవించుకున్నప్పుడే వారు భవిష్యత్తులో మంచి లక్ష్యాలను అధిరోహించగలరన్నారు. ప్రస్తుత సమాజంలో విద్యార్థులు సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల చదువుపట్ల ఏకాగ్రతను కోల్పోవాల్సి వస్తుందన్నారు. మానవత సంస్థ వ్యవస్థాపకులు యన్ రామచంద్ర రెడ్డి గారి ఆదేశాలు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మానవతా మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నైతిక విలువలపై అవగాహన సదస్సును కల్పిస్తూ వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందజేయడం జరుగుతుందన్నారు.చందన, శివకుమార్ ,సుష్మ తాజ్ విద్యార్థులకు మానవత ప్రశంసా పత్రాలతో పాటు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆంజనేయులు,ఇలియాస్ బాషా,వేణుగోపాల్ రాజు, పిడి లు జగదీశ్వరయ్య, మనోహర్ రెడ్డి ,జానకి,కే రమాదేవి, డి.వీరమాదేవి తదితర ఉపాధ్యాయ బృందం తో పాటు విద్యార్థులు హాజరయ్యారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *