రాజమహేంద్రవరం లో నారా లోకేష్ గారిని కలిసి సంఘీబావం తెలియజేసిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు
రాజమహేంద్రవరం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఢిల్లీ నుండి వచ్చిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారిని కలిసి సంఘిబావం తెలియజేసిన మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు, లోకేష్ బాబు ప్రసాద్ బాబు గారిని ఆప్యాయంగా పలకరించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే పార్టీ కార్యక్రమాల గురించి చర్చించారు.ఈసందర్భంగా ప్రసాద్ బాబు గారు నిన్న,ఈరోజు లోకేష్ బాబు తో అక్కడే వుండి ముఖ్యనాయకులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అక్కడే కార్యాలయంలో ఉన్న మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారిని,మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారిని,గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మర్యాద పూర్వకంగా కలిసి పలు రాజకీయ అంశాలు మాట్లాడారు.