రాజంపేట :రాష్ట్రంలో 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా… ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక అనే కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం

వీరబల్లి మండలం పెదవీడు     గ్రామ పంచాయితీ రెడ్డివారిపల్లె జిల్లాపరిషత్ హైస్కూల్ నందు ప్రజావేదికలో పాల్గొని… 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్థానికులకు వివరించిన రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం . గ్రామంలోకి వచ్చిన ఇంచార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం గారికి మండల టీడీపీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, సురేంద్ర రెడ్డి గారు తెలుగుదేశం,బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.ఆయన పై పూల వర్షం కురిపిస్తూ వేదిక వద్దకు తీసుకువెళ్లారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *