తాడేపల్లి: తాడేపల్లి ప్రకాష్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అవరణ లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ విధులు నిర్వర్తిస్తూ రేపుడి కృపమ్మ (37) అనే ఆశా వర్కర్ మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కృపమ్మ గేట్ వద్ద విధుల్లో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. వైద్యులు పరిశీలించి ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. దారిలోనే కృపమ్మ మృతిచెందింది.ఆరోగ్య కేంద్రం లో ఆశా వర్కర్ కు సరైన వైద్యం వెను వెంటనే అందితే బ్రతికే అవకాశం ఉండేది. సరైన వైద్యం అందక మృతి చెందటం బాధాకరం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మృతురాలి భర్త కు పక్షవాతం రాగా , ఇద్దరూ పిల్లలున్నారు. కృపమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఆశా వర్క ర్లు , స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.