నాలుగేళ్లలో ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ సర్వీసులును అందించడం హర్షదాయకం …

విద్యుత్ సమస్యలపై సమీక్షించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి

రాయచోటి నియోజక వర్గంలో నాలుగేళ్ల పాలనా కాలంలో ఎనిమిది వేల వ్యవసాయపు విద్యుత్ సర్వీసులు (ట్రాన్స్ ఫార్మర్లు) అందించడం హర్షదాయకమని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.నియోజక వర్గంలోని విద్యుత్ సమస్యలపై ఏపి ఎస్ పి డి సి ఎల్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డితో రామాపురం మండలం రాచపల్లె లో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల కాలం నాటికి రైతులకు వ్యవసాయ విద్యుత్ సర్వీసులను రెండు వేల మాత్రమే ఇచ్చారన్నారు.రైతులకు,వినియోగ దారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంఎల్ఏ సూచించారు. గృహాలుపై ప్రమాదకరంగా వెల్లుచున్న 33 కె వి ,11 కె వి విద్యుత్ స్తంభాలు, లైన్ల తొలగింపు పనులను, గడప గడపకు మన ప్రభుత్వంలో వచ్చిన విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గాలివీడు మండలంలోని అరవీడు, చీమల చెరువుపల్లె లలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చిన విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఒక రాయచోటి పట్టణంలో గృహ వినియోగ దారులకు సబందించి అదనంగా 50 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.దరఖాస్తుచేసుకున్న రైతులందరికీ వ్యవసాయపు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలన్నారు. రామాపురం మండలం రాచపల్లెలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంఎల్ఏ సూచించారు. ఏఈ వరప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *