అమరావతి:ఆడపిల్లల బాత్‌ రూముల్లో హెడెన్‌ కెమెరాలు.. మూడు వందలకు పైగా వీడియోలు..విషయం బయటకు పొక్కకుండా తగు జాగ్రత్తలు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజి అమానవీయ ఘటనపై వెంటనే చర్యలు ఉండాలని ఏపీసీసీ ఛీఫ్‌ వైఎస్‌ షర్మిలా రెడ్డిడిమాండ్‌ చేసారు. ఒక ఆడబిడ్డ తల్లిగా ఈ ఘటన నన్ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చదవు,సంస్కారం నేర్పాల్సిన విద్యాసంస్థలు.. పిల్లలకు ఏం నేర్పుతున్నాయోనన్న ఆలోచనలో పడేసింది. ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే, వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటనే మరో నిదర్శనం. కాలేజిల్లో పర్యవేక్షణ కొరవడిరదనడానికి సజీవ సాక్ష్యం. యాజమాన్యాల నిర్లక్ష్యానికి నిలవెత్తు దర్ఫణం.కాసుల కక్కుర్తి తప్పా.. భద్రత ప్రమాణాలు గాలికొదిలేశారనే దానికి ఈ ఘటనే ఉదాహరణ అని అన్నారు.
ఈ ఘటనపై సాధారణ విచారణ కాదు. ఫాస్ట్రాక్‌ విచారణ జరగాలి. తక్షణం ఉన్నతస్థాయి కమిటి వేయాలి. సీనియర్‌ ఐపిఎస్‌ అధికారులతో విచారణ జరగాలి. బాత్‌ రూముల్లో కెమెరాలు పెట్టింది ఎవరో వెంటనే తేల్చాలి. రాజకీయ నాయకుడి కొడుకా..కూతురా కాదు.. కెమెరాలు పెట్టింది ఎవరైనా..ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాల్సిందే. మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు ఉండాల్సిందే. బాత్‌ రూముల్లో రికార్డ్‌ అయిన ఏ వీడియో కూడా పబ్లిక్‌ కాకుండా చూడాలని పోలీస్‌ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాం.వచ్చేవారం లోపు చర్యలు చేపట్టకపోతే నేను కాలేజీని సందర్శిస్తా. విద్యార్థినిలతో మాట్లాడుతా. వారు కోరుకున్నట్లు న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హావిూ ఇస్తుందని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *