విజయవాడ, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎం అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. 22ఏ, ప్రీహోల్డ్‌ భూములపై రీ సర్వే చేయాలని, సర్వే రాళ్లపై ఉన్న జగన్‌ బొమ్ముల తొలగించాలని తీర్మానించింది. సెబ్‌ రద్దు చేసి ఎక్సైజ్‌ శాఖను పునరుద్ధరించాలని తేల్చింది. రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి ముగింపు పలికింది. పోలవరం ఎడమకాలువ పురుద్ధరణ, కాలువ సామర్థ్యాన్ని ఆరు వేల క్యూసెక్కులకు పెంచేలా నిర్ణయం తీసుకుంది. సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకి కూడా కేబినెట్‌ ఓకే చెప్పింది. వీటితోపాటు రాష్ట్రంలోని మున్సిపల్‌ శాఖలో 269 సూపర్‌ న్యూమరీ పోస్టులు భర్తీ చేయాలని కూడా కేబినెట్‌ నిర్ణయించింది. కొత్తగా 2,771 రేషన్‌ దుకాణాల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇకపై ఇవాల్టి నుంచి పేపర్‌ లెస్‌ కేబినెట్‌ విూటింగ్‌ నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 2014`19 మధ్య ఇలా పేపర్‌ లెస్‌ కేబినెట్‌ చంద్రబాబు నిర్వహించే వాళ్లు. తర్వాత ప్రభుత్వం మారడంతో ఆ విధానానికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో మళ్లీ పేపర్‌ లెస్‌ విధానం తీసుకొచ్చారు. ఈ విధానంలో మంత్రులకు ఆన్‌లైన్‌లోనే నోట్‌ ఇతర వివరాలు అందజేస్తారు. ఇప్పటికే మంత్రులకు సహాయం చేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
IIవైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం రద్దు. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌
IIపట్టాదారు పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటో తొలగింపు
IIపోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. ఈ పనుల్లో ప్రస్తుత కాంట్రాక్ట్‌ సంస్థనే కొనసాగించేందుకు నిర్ణయం
IIఆబ్కారీ శాఖ పునర్‌ వ్యవస్థీకరణకు పచ్చజెండా. తదనుగుణంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) రద్దుకు ఆమోదం
IIవివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేతకు ఓకే చెప్పిన క్యాబినెట్‌
IIసాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అంగీకారం

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *