ఏలూరు, ఆగస్టు 19: సమాజంలో మనిషి మాయమవుతున్నాడు. జంతువును జంతువు వేటాడే ఆటవిక రాజ్యంగా సమాజం మారుతోంది. స్నేహం చేసిన పాపానికి.. స్నేహితుడి భార్యని చెరిచారు ముగ్గురు యువకులు. భర్త ఎదుటే ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన ఏలూరులో వెలుగు చూసింది. మూడు పోలీస్‌ స్టేషన్లకు కూత వేటు దూరంలో ఈ దారుణం జరిగింది. 15 రోజుల క్రితమే నగరానికి చేరుకున్న ఆ దంపతులు పగలంతా హోటల్లో పనిచేసి.. రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్టేజీపై పడుకునేవారు. ఇల్లు అద్దెకు దొరికే వరకు అక్కడే గడుపుతున్నారు. ఇంతలో నగరానికి చెందిన ముగ్గురు యువకులు వారికి పరిచయమయ్యారు. వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జులాయిగా తిరిగేవారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు వీరికి పరిచయం అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ వివాహిత భర్తతో మద్యం తాగిన కొంతమంది యువకులు.. ఆ తర్వాత అతనిపై దాడి చేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. ఏలూరు నగరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దారుణం చోటుచేసుకుంది. ఏలూరు నగరంలోని మూడు పోలీస్‌ స్టేషన్‌ లకు కొంత దూరంలోనే ఈ ఘటన జరిగింది.ఏలూరు వన్‌ టౌన్‌ రామకోటి ప్రాంతంలో పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన రెండవ భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. 15 రోజుల క్రితమే వీరు ఆ ప్రాంతానికి వచ్చారు. వీరిద్దరూ పగటిపూట ఆ నగరంలోని హోటల్‌ లో పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో రామకోటి ప్రాంతంలోని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ నిర్వహించే ఓ వేదికపై పడుకుంటున్నారు. అద్దెకు ఇల్లు దొరకపోవడంతో వారు గత కొద్ది రోజులుగా ఇలానే చేస్తున్నారు.ఈ దంపతులకు ఏలూరు నగరానికి చెందిన ముగ్గురు యువకులు ఇటీవల పరిచయం అయ్యారు. వారు కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పనులు దొరకని సమయంలో ఖాళీగా రోడ్లపై తిరుగుతుంటారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ముగ్గురు యువకులు , విజయరాయి ప్రాంతానికి చెందిన వ్యక్తితో కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో అటు పక్కనే అతడి భార్య పడుకుంది. మద్యం బాగా తాగిన తర్వాత ఆ ముగ్గురు యువకులు అతనిపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం పక్కనే పడుకుని ఉన్న అతడి భార్యను కొంత దూరం లాక్కుని వెళ్లారు. ఆమె ముఖంపై తీవ్రంగా దాడి చేశారు. అనంతరం అత్యాచారం చేశారు. వారు చేస్తున్న ఘాతుకాన్ని చూడలేక ఆమె భర్త కేకలు వేస్తూ రోడ్డుపైకి వచ్చాడు. అటుగా వెళుతున్న యువకుడికి విషయం చెప్పాడు. ఆ యువకుడు ఆ ఘటన స్థలానికి వెళ్ళగా నిందితులు ముగ్గురు పరారయ్యారు. ఆ బైక్‌ పై వచ్చిన యువకుడు డయల్‌ 100 కు కాల్‌ చేసినప్పటికీ పోలీసులు స్పందించలేదు. ఆ నెంబర్‌ కి కాల్‌ చేస్తే చేస్తాం, చూస్తామని పోలీసులు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కి వెళ్లి విషయం చెబితే.. వారు నిమిషాల్లోనే అక్కడికి వెళ్లారు?ఈ ఘటనలో ముగ్గురు నిందితులను ఏలూరు వన్‌ టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెంచుల కాలనీకి చెందిన నూతి పల్లి పవన్‌, లంబాడి పేటకు చెందిన నారపాటి నాగేంద్ర, మారడాని రంగారావు కాలనీకి చెందిన గడ్డి విజయ్‌ కుమార్‌ అలియాస్‌ నాని ని వన్‌ టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మణ్‌ బాబు, సిబ్బంది అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *