16 న జరిగే ఏపి కేబినెట్ సమావేశంలో బోగస్ సర్టిఫికేట్లు ఏరివేతకు అధికారులను ఆదేశించాలి
బోగస్ సర్టిఫికేట్ దారులు బరితెగించి ఉన్నతాధికారులను జైలుకు పంపే ప్రయత్నాన్ని నిలువరించాలి
2002 నోటిఫికేషన్ ముగింపుకు చర్యలు తీసుకోవాలి
ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్
యండపల్లి (రాయచోటి, అన్నమయ్య జిల్లా)13-07-2024:- ఈ 16 న జరిగే ఏపి కేబినెట్ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖలోని మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ బోగస్ సర్టిఫికేట్లు ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించాలని,బోగస్ సర్టిఫికేట్ దారులు బరితెగించి తప్పుడు సమాచారంతో రాష్ట్ర ఉన్నతాధికారులను జైలుకు పంపే ప్రయత్నాన్ని నిలువరించాలని,2002 డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కు ముగింపు పలకడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఏపీ డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.బోగస్ సర్టిఫికేట్లు సత్వరం ఏరివేయలని, అదే సమయంలో జెన్యూన్ సర్టిఫికేట్ దారులను రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని ఆయన కోరారు.అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖలోని కొందరు అక్రమ ధనార్జన లక్ష్యంగా పనిచేస్తున్న అవినీతి అధికారుల బారినుండి నిజాయితీయైన అధికారులను కాపాడాలని ఆయన కోరారు.
బోగస్ సర్టిఫికేట్ దారులకు డియస్సిలో అక్రమ మార్కులు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు పోందుతున్న ప్రక్రియ పట్ల ఉన్నతిధికారుల ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే ఈనాటి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదే 2002 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ క్యాడర్లులను భర్తీ చేసినప్పటికీ వాటిన్నిటికి ఓకే సారి ముగింపు పలికారని, అయితే నేటికీ 22 సంవత్సరాల కాలం గడిచిన,ఆదే నోటిఫికేషన్ ను హెల్త్ అసిస్టెంట్ క్యాడర్ ను మాత్రం బోగస్ సర్టిఫికేట్లు మాఫియా సూచనలతో ప్రతి దశలో న్యాయస్థానాలకు తప్పుడు సమాచారంతో తప్పుదారి పట్టించి బారి యెత్తున వ్యాపారం కోనసాగతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు
నిజాలను నిర్భయంగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి కోర్టుకు పిటనర్ల రూపంలో ఉన్న బొగస్ సర్టిఫికేట్ ఏరివేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.గత మూడు దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్న అర్హులైన ప్రభుత్వ శిక్షణ సంస్థల హెల్త్ అసిస్టెంట్లు త్వరితగతిన రెగ్యులర్ చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఇప్పటికే ప్రైవేట్ శిక్షణ సంస్థల సర్టిఫికేట్లు బోగస్ ని తేల్చి చెప్పిన విజిలెన్స్ రిపోర్ట్ పరిగణలోనికి తీసుకోని వెంటనే ముమ్మరంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.