కేంద్ర ప్రభుత్వము వివిధ రకాల చేతి వృత్తులును ప్రోత్సాహించుటకు ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన
పథకం 17-9-2023 వ తేదీన ప్రారంబించటం జరిగినది. ఇందులకు సంబంధించి దిగువ తెలిపిన 18 రకాల
చేతి వృత్తుల వారికి కులం తో సంబంధం లేకుండా ఈ పథకం నందు నమోదు చేసుకొన వచ్చును.
ఈ నమోదు గ్రామ సచివాలయం నందు మరియు గ్రామ స్థాయి లో సి‌ఎస్‌సి కేంద్రాల లో ఉచితంగా
నమోదు చేసుకొన వచ్చును.
ఈ‌ కేంద్ర విశ్వకర్మ యోజన పథకమునకు క్రింది కుల వృత్తి వారు అర్హులు :

 చర్మ కారులు
 చెప్పులు కుట్టే వారు
 బట్టలు ఉతికే రజకులు
 బట్టలు కుట్టే దర్జీలు
 చేపలవల తయారీ దారులు
 బొమ్మల తయారీ దారులు
 పూల దండలు అల్లే వారు
 కత్తులు తయారు చేయువారు
 వడ్రంగి
 కమ్మరి
 కుమ్మరి
 క్షరకులు
 తాపీ పని చేసేవారు.
 పడవల తయారీ
 సంప్రదాయ బొమ్మల తయరి ‘దారులు
 బుట్ట/చాప/చీపుర్లు నేసేవారు
 శిల్ప కళాకారులు

ఈ‌ కేంద్ర విశ్వకర్మ యోజన పథకమునకు ఈ క్రింది అర్హతలు కలిగిన వారు అర్హులు :

– 18 సంవత్సరాల కంటే ఎక్కవ వయస్సు కలిగి వారి పూర్వీకుల నుండి కుటుంబ వృత్తిగా చేస్తున్న హస్తకళాకారులు ఈ విశ్వ కర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులు.
– ఎంపిక చేయు లబ్దిదారుడు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క క్రెడిట్‌ ఆధారిత పధకాల క్రింద రుణాలు పొంది ఉండ కూడదు(రుణాన్ని తిరిగి చెల్లించిన వారు PM విశ్వ కర్మ క్రింద అర్హులు.
– కుటుంబంలో ఒకరు మాత్రమే రిజిస్ట్రేషన్‌ కు అర్హులు, లబ్దిదారుల గుర్తింపునకు కులం తో సంబంధం లేదు.
ఈ విశ్వకర్మ ప్రోగ్రామ్ వలన కలిగే ప్రయోజనాలు :
– ఐ.డి కార్డు మరియు సర్టిఫికెట్‌ ఇవ్వబడును.
– ఆసక్తి కల వారికి 5-7 రోజుల శిక్షణ ఇవ్వబడును.
– శిక్షణ సమయంలో రోజుకు రూ 500/- ఇవ్వబడును
– రూ 15000/- ల విలువ కల టూల్‌ కిట్‌ ఉచితంగా ఇవ్వబడును.
– మొదటి విడత 1లక్ష లోన్‌(18 నెలల రీ పేమెంట్‌)
– రెండవ విడత 2 లక్షల లోన్‌(30 నెలల రీ పేమెంట్‌)
– పై రుణానికి సంవత్సరానికి 5% వడ్డీ మాత్రమే వసూలు చేయబడును.

గమనిక : ప్రదానమంత్రి విశ్వకర్మ యోజన పథకం క్రింద మీ సచివాలయం లోని డిజటల్‌ అసిస్టెంట్‌ దగ్గర గాని కామన్‌సర్విస్‌ సెంటర్‌ సందుగాని నమోదు చేసుకొనగలరు.

కావున ఈ సదవకాశాన్ని అన్నమయ్య జిల్లాలోని కులవృత్తుల వారు అందరూ సద్వినియోగ పరచుకోగలరని, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరి శ్రీధర్ తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *