అన్నమయ్య జిల్లా,రాయచోటి నియోజకవర్గం: నూతన బస్సులను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండీపల్లి రాంప్రసాద్ రెడ్డి

ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే ఆర్టీసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ దశగా ముందడుగు వేస్తాం రవాణా శాఖ మంత్రివర్యులు మండిపల్లి

ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను ప్రారంభిస్తాం

త్వరలోనే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమీక్షించి మహిళా ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తాం

చిన్న వయసులో క్యాబినెట్ లో చోటు కల్పించడమే కాకుండా కీలక శాఖలు తనకు అప్పగించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనాయకులు నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలిపిన రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి

గురువారం 27 ఉదయం రాయచోటి బస్టాండ్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి   ప్రభుత్వం కొనుగోలు చేసిన నూతన బస్సులను ప్రారంభించారు అనంతరం విలేకరుల ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులు ఆక్రమించుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేశారన్నారు. కాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన గావించి ప్రయాణికులకు నాణ్యమైన సేవల అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నూతన బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండిపల్లి

అన్నమయ్య జిల్లాలను మారుస్తున్నారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఎట్టి పరిస్థితుల్లో జిల్లా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఊరు పేర్లు, సంస్థల పేర్లు మార్చే ప్రభుత్వం మాది కాదని మాది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వము అని పేర్కొన్నారు… రాబోయే కాలంలో రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *