ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రపడ్డాం.కోటి ఐదు లక్షల మంది అక్కచెల్లెళ్లకు మేలు చేశాం అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదు.అండగా ఉన్న ఆసరా 0 వడ్డీతో అండగా ఉన్నం చేయూతతో తోడుగా ఉన్నాం.అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాయాలు ఏమయ్యాయో తెలియదు.
ఎన్ని మంచి పనులు చేసిన ఆప్యాయత ఏమైందో తెలియడం లేదు.54 లక్షల మంది రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాం. సమయానికి వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ మొదలుకాగానే అందించాం.రైతన్నల ప్రేమ ఏమైందో తెలియడం లేదు.విద్యా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చాం తల్లుల పిల్లల అభిమానం ఏమైందో తెలియడం లేదు.మేనిఫెస్టో బైబిల్ గా ఖురాన్ గా భగవద్గీతగా మొట్టమొదటి రోజు నుంచి భావిస్తూ 99% వాగ్దానాలు అమలు చేసాం.ఎప్పుడూ చూడని విధంగా సచివాల వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం.విద్య వైద్య వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొస్తూ పేదవారికి అండగా నిలిచాము.సామాజిక న్యాయం అంటే ఇది అని ప్రపంచానికే చూపించగలిగాం.కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత వారి అభిమానం ఆప్యాయత ఏమైందో తెలియదు- జగన్
ఎవరో మోసం చేశారు అన్యాయం చేశారు అనవచ్చు కానీ ఆధారాలు లేవు.ఏం జరిగిందో దేవుడికి తెలుసు చేయగలిగింది ఏమీ లేదు ప్రజల తీర్పును శిరసా వహిస్తున్న- జగన్.మంచి చేయటానికి ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటా- జగన్.ఓడిపోయిన కూడా ప్రతి కార్యకర్తకు నాయకుడు వాలంటీరుకు ప్రతి స్టార్ క్యాంపెనర్ కు అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు కృతజ్ఞతలు తెలిపిన- జగన్.గుండె ధైర్యంతో ఎక్కడి నుంచి మళ్లీ లేస్తాం ప్రతిపక్షంలో ఉండడం కోసం కాదు పోరాటాలు చేయటం అంతకన్నా కొత్త కాదు-రాజకీయ జీవితమంతా ఐదు సంవత్సరాల తప్ప ప్రతిపక్షంలోనే గడిపా-రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు చూశా.
నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు – జగన్