విశాఖపట్నం జూన్‌ 5: కేంద్రంలో ఎవరికి మద్దతు ఇస్తారనే విషయంపై టిడిపి అధినేత చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలో చంద్రబాబు విూడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని, ఎన్నో రాజకీయ మార్పులను చూశానని, ఇప్పుడు ఎన్‌ డిఎతోనే టిడిపి ప్రయాణం చేస్తుందని వివరణ ఇచ్చారు. ఇవాళ కూటమి విూటింగ్‌కు ఢల్లీి వెళ్తున్నానని, ఆ తర్వాత ఏమైనా మార్పులుంటే విూకు తప్పకుండా చెప్తానని చంద్రబాబు పేర్కొన్నారు.కూటమి ఘనవిజయంపై ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. విూడియాతో సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు విూడియాతో మాట్లాడారు. శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని తాను ఎప్పుడూ చూడలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్నారు. ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్వేయమన్నారు.ఎన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్లామని, రాజకీయాల్లో ఎవరూ శాశ్వంతం కాదని, దేశం ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీలు శాశ్వతమని బాబు స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పని చేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని, ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పని చేశారని, పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారని, తెలుగు దేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని ఆయన కొనియాడారు. 1983లో ఎన్‌టిఆర్‌ పార్టీ పెట్టినప్పుడు టిడిపి 200 సీట్లు వచ్చాయని, మళీ ఇవాళ ఊహించనివిధంగా ఫలితాలు వచ్చాయని, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు మాట్లాడే స్వేచ్ఛ ఉండాలన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *