హై కోర్టు ఇచ్చిన తీర్పును పాటించని మమతకు సీఎం పదవిలో ఉండే అర్హత లేదు
బెంగాల్‌ లో హిందువులు కూడా ఉద్యోగాలకోసం మతమార్పిడి చేసుకోవాల్సిన దుస్థితి
మమతాబెనర్జీ ప్రభుత్వం హిందూ మతమార్పిడిని ప్రోత్సహిస్తుంది
హైదరాబాద్‌ మే 24:పశ్చిమ బెంగాల్‌ లో చట్ట విరుద్ధంగా ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పునివ్వడాన్ని బిజెపి స్వాగతిస్తున్నట్లు మాజీ ఎంపి డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌ తెలిపారు. శుక్రవారం బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో విూడియా సమావేశం లో ఓబిసి మోర్చా రాష్ట్ర అద్యక్షులు ఆనంద్‌ గౌడ్‌,బార్‌ కౌన్సిల్‌ వైస్‌ చర్మెన్‌ సునీల్‌ గౌఎ, బాబ్బురి శ్రీనివాస్‌ గౌడ్‌ ,జి.మల్లేశం గౌడ్‌ లతో కలిసి మాట్లాడారు. హిందూ వ్యతిరేక కుట్రలో భాగంగా రిజర్వేషన్లు మమతా బెనర్జీ ప్రభుత్వం చేసింది. మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలని కలకత్తా హై కోర్టు ఇచ్చిన తీర్పును పాటించనివాళ్లకు సీఎం పదవిలో ఉండే అర్హత లేదన్నారు.మమతాబెనర్జీ ప్రభుత్వం మత రాజకీయాలతో బెంగాల్‌ లో హిందువులు కూడా ఉద్యోగాలకోసం మతమార్పిడి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆవేదన వ్యక్తం చేసారు. దీనిని బట్టి చుస్తే మమతాబెనర్జీ ప్రభుత్వం హిందూ మతమార్పిడిని ప్రోత్సహించిందన్నది స్పస్టమవుతున్దన్నారు.డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు సమాజంలో సమానత్వం కోసం రిజర్వేషన్లు కల్పించారు.దశాబ్ధాలుగా విద్య, ఆర్థిక రంగంలో వెనుకబడిన రంగాలను రిజర్వేషన్ల ప్రక్రియతో విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించి బడుగు బలహీన వర్గాల ప్రజల బతుకులను మార్చి ఏక్‌ భారత్‌, శ్రేష్ట్‌ భారత్‌ గా మార్చేలా అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు..బిజెపి 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగం, రిజర్వేషన్లను రద్దు చేస్తారని కాంగ్రెస్‌ పార్టీ దుష్ప్రచారం చేస్తోంది.భారతదేశంపై దండయాత్రలు చేసిన గజనీ, ఘోరీల కంటే ఘోరంగా రిజర్వేషన్లపై చేస్తున్నారు. తమ రాజకీయ ప్రయోజనం కోసం అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలకు ప్రభుత్వంలో,సైన్యంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని మమతా బెనర్జీ దురాలోచన చేస్తున్నారు.మతపరమైన రిజర్వేషన్లతో 70 నుండి 75 శాతం మేర హిందువులు, బీసీలకు మమతా బెనర్జీ వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ కమిషన్‌ ద్వారా కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు బీసీ లకు ఇస్తామని లేఖ విడుదల చేశారు.మొదటి అసెంబ్లీ ఐపోయినా ఇంతవరకు అమలు చెయ్యలేదు.బీసీ రిజర్వేషన్లు తేల్చకుండా స్థానిక ఎన్నికలకు సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లడాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది.బీసీ రిజర్వేషన్ల అమలు సాధనకు అవసరమైతే మిలియన్‌ మార్చ్‌ తరహాలో ఉద్యమం చేస్తాం.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే కాంగ్రెస్‌ నాయకులు ప్రజలకు వద్దకు
వెళ్లాలి.సంవత్సరానికి బీసీ వెల్ఫేర్‌ కోసం 20 కొట్లు కేటాయించాలి.కాంగ్రెస్‌ కు చెందిన ప్రతి నాయకుడి డీఎన్‌ఏ లో బీసీ వ్యతిరేకతే ఉంది. ఇది ఒక బీసీ నాయకుడిగా నేను చెబుతున్నా.పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్‌ తర్వాత వెస్ట్‌ బెంగాల్‌ లో రాజకీయంగా భారీ మార్పులు జరగబోతున్నాయి. బెంగాల్‌ లో బిజెపి మెజారిటీ సీట్లు గేలవబోతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *