అన్నమయ్య జిల్లా : రాష్ట్రంలో సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు పక్షాన సత్యమే గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి గారు అన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజు కు చేరుకున్నాయి . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయగానే తానే మరల ముఖ్యమంత్రి అవుతానని ఆనందంలో ఉన్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు గారి అరెస్టుతో జగన్ రెడ్డి ప్రజల్లో చేతగాని ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రం లో వైసీపీ ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని,ఎవరు ప్రశ్నిస్తే వారి పై అక్రమ కేసులు నమోదు చేపించడం ఫ్యాషన్ అయిపోయిందని అన్నారు .వైసీపీ పెట్టించే అక్రమ కేసులకు ఎవరు బయపడరని ఎదురొడ్డి నిలబడతారు అని అన్నారు రాబోయే ఎన్నికలలో ప్రజల దగ్గరకు ఏవిధంగా వెళతారని ఆయన అన్నారు అభివృద్ధి అనేది మరచిన వైసీపీ కి ఓటు అడిగే హక్కు లేదన్నారు ఈ కార్యక్రమం లో రాయచోటి నియోజక వర్గంలో ని అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తాళాలు కొడుతూ నిరసన తెలియజేశారు, అంతేకాక ఈ కార్య క్రమంలో రాష్ట్ర కార్యదర్శి రాజుల ఖాదర్ భాషా , వతన్ నిస్సార్ , మాజీ జెడ్పిటిసి మల్లు నర్సారెడ్డి గారు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి చిన్న రెడ్డి యాదవ్ ఉమాపతి రెడ్డి ఎన్ సహదేవరెడ్డి సుబ్బయ్య నాయుడు సుబహాన్ రామకృష్ణ గౌడ్ జగిలి సుబ్బరాయుడు ఎన్ వెంకట్రామిరెడ్డి భవనం వెంకటరామిరెడ్డి నాగవసిరెడ్డి జయరామిరెడ్డి లక్ష్మిరెడ్డి గంగయ్య చాంద్ బాషా వలి భాష ఈశ్వరయ్య సుబ్బయ్య మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *